క్రీస్తు రాజు మహోత్సవ స్తుతి గీతం - 2025
Автор: Anchuri Anthony Reddy
Загружено: 2025-11-18
Просмотров: 914
Описание:
క్రీస్తు రాజు మహోత్సవ స్తుతి గీతం - 2025
పల్లవి (Pallavi)
సమస్త లోకాలు శరణు జొచ్చును,
క్రీస్తే మా రాజెని! క్రీస్తే మా ప్రభువని!
సకల జీవులు పలుకుతాయి,
క్రీస్తే మా రాజెని! రాజాధి రాజెని!
స్తుతి,స్తుతి, స్తుతి, స్తుతి!
సర్వ లోకాధీశ్వరుడా!
ప్రభూ క్రీస్తు రాజా,
నీకే మా స్తుతి! నీకే మహిమ!
నీకే మా స్తుతి! నీకే మహిమ!
చరణం 1
ఈ లోక రాజ్యాలు నశించిపోవును,
నీ రాజ్యనీతి నిత్యం నిలిచిఉండును.
ఐహిక వైభవము అంతమై పోవును,
నీ ప్రేమ పాలనయే శాశ్వతము.
తినుట, త్రాగుట కాదు నీ రాజ్యము,
పవిత్రాత్మ ప్రసాదించు నీతి, శాంతి, సంతోషములే!
(Chorus)
సమస్త లోకాలు మొక్కుతాయి,
క్రీస్తే మా రాజెని! క్రీస్తే మా ప్రభువని!
సకల జీవులు పలుకుతాయి,
క్రీస్తే మా రాజెని! రాజాధి రాజెని!
స్తుతి,స్తుతి, స్తుతి, స్తుతి!
సర్వ లోకాధీశ్వరుడా!
ప్రభూక్రీస్తు రాజా,
నీకే మా స్తుతి! నీకే మహిమ!
నీకే మా స్తుతి! నీకే మహిమ!
చరణం 2
రాజ భవనాల యందు లేదు నీ దర్పం,
పశువుల పాకయే దానికి సాక్ష్యం.
బాహ్య ఆసనం కాదే నీ పాలన యంత్రం,
వినయపు జీవితమే నీ రాజ్యపు అస్త్రం.
లోకుల మన్నన, స్తుతి, ఘనత- క్షణకాలం,
మీ దీనత్వమే కలకాలం...అదే మీ రాజ్య లక్షణము.
(Chorus)
సమస్త లోకాలు మొక్కుతాయి,
క్రీస్తే మా రాజెని! క్రీస్తే మా ప్రభువని!
సకల జీవులు పలుకుతాయి,
క్రీస్తే మా రాజెని! రాజాధి రాజెని!
స్తుతి,స్తుతి, స్తుతి, స్తుతి!
సర్వ లోకాధీశ్వరుడా!
ప్రభూక్రీస్తు రాజా,
నీకే మా స్తుతి! నీకే మహిమ!
నీకే మా స్తుతి! నీకే మహిమ!
చరణం 3
సిలువనందు వేదనలోనూ నీవు,
శత్రువులనైన క్షమించినావు!
తల దాచుకొను స్థలమే లేకున్నను, నిను నమ్మువారికి స్వర్గ స్థానమిచ్చు రాజువు.
నీవే ఆ స్వర్గరాజువు, ఆ రాజ్యానికి ఓ నేరస్తుడే మొదటి సభ్యుడు,
ఆ క్షణమే మొదలైనది నీ రాజ్యపు నిజ లక్షణము... అందరి రక్షణయే నీ రాజ్య లక్ష్యము.
(Chorus)
సమస్త లోకాలు మొక్కుతాయి,
క్రీస్తే మా రాజెని! క్రీస్తే మా ప్రభువని!
సకల జీవులు పలుకుతాయి,
క్రీస్తే మా రాజెని! రాజాధి రాజెని!
స్తుతి,స్తుతి, స్తుతి, స్తుతి!
సర్వ లోకాధీశ్వరుడా!
ప్రభూక్రీస్తు రాజా,
నీకే మా స్తుతి! నీకే మహిమ!
నీకే మా స్తుతి! నీకే మహిమ!
రచన
గురుశ్రీ అంచూరి అంతోని
గుంటూరు పీఠం
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: