బాప్తిస్మ యెహాను వారి గీతం.
Автор: Anchuri Anthony Reddy
Загружено: 2025-12-20
Просмотров: 414
Описание:
బాప్తిస్మ యెహాను వారి గీతం
సాకి : అదిగో! అదిగో! అదిగదిగో
ప్రభు మార్గం సిద్ధపరచే గంభీర స్వరం.
అదిగో! అదిగో! అదిగదిగో
దేవుని గొర్రెపిల్లను లోకానికి చూపిన మహనీయుడు.
వారే బాప్తిస్మ యోహాను వారు.
మనందరిలోనూ అధికునిగా
ఎంచబడిన ధన్యమూర్తి వారు.
కోరస్: తెలియదా! తెలియదా లోకమా బాప్తిస్మ యోహాను చరిత్ర?
తెలియదా! తెలియదా! ప్రభు రాకకు మార్గం వేసిన పుణ్యమూర్తి ఘనత?
చరణం 1.
తల్లి గర్భానే రక్షకుని గుర్తించి, గంతులువేసెను! ఈ యోహాను.
మూగవోయిన తండ్రి 'యోహాను' అని వ్రాసినంతనే,
నాలుక పట్టు సడలి, ప్రభు స్తుతి గీతములే పాడెను ఆనందముతో.
కోరస్: తెలియదా! తెలియదా లోకమా
బాప్తిస్మ యోహాను చరిత్ర?
తెలియదా! తెలియదా! ప్రభు రాకకు మార్గం వేసిన పుణ్యమూర్తి ఘనత?
చరణం 2.
సుతుడైన దేవుని రాకకై
మరుభూమిలో వినిపించిన మహా గొప్ప గొంతుక! ఈ యోహాను.
నేను కానే కాను, అతడే అధికుడు అని
తన వినయము ప్రకటించిన ధన్యమూర్తి! ఈ యోహాను.
ప్రభు పాదరక్షలవారును విప్పుటకైనా యోగ్యుడను కాను' అను
అపారమైన దాస్య నీతిని బోధించిన ధీరుడు!
కోరస్: తెలియదా! తెలియదా లోకమా బాప్తిస్మ యోహాను చరిత్ర?
తెలియదా! తెలియదా! ప్రభు రాకకు మార్గం వే సిన పుణ్యమూర్తి ఘనత?
చరణం 3.
హృదయ పరివర్తన చెందుడు, బాప్తిస్మమును పొందుడు' అని
ప్రకటించిన తొలి నీతిమంతుడు! ఈ యోహాను.
యేసుకే బాప్తిస్మమును ఇచ్చిన గొప్ప యోగ్యుడు! ఈ యోహాను.
పాపాన్ని ఖండించి, ఆ పాపుల చేతినే శిరచ్ఛేదితుడై
దేవునిలో చిరంజీవిగా నిలచిన వారిని గూర్చి... తెలియదా!
కోరస్: తెలియదా! తెలియదా! లోకమా బాప్తిస్మ యోహాను చరిత్ర?
తెలియదా! తెలియదా! ప్రభు రాకకు మార్గం వేసిన పుణ్యమూర్తి ఘనత?
అదిగో! అదిగో! అదిగదిగో
ప్రభు మార్గము సిద్ధపరచే గంభీర స్వరం.
అదిగో! అదిగో! అదిగదిగో దేవుని గొర్రెపిల్లను లోకానికి చూపిన మహనీయుడు.
వారే బాప్తిస్మ యోహాను వారు.
కీర్తింతుము వారిని, కీర్తించి తరియింతుము!
రచన
ఫా: అంచూరి అంతోని
గుంటూరు పీఠం
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: