కారుణ్యమూర్తి | Telugu Jesus Song | Powerful Christian Devotional | Christmas Special
Автор: Calvary Madhurimalu
Загружено: 2025-12-23
Просмотров: 588
Описание:
కారుణ్యమూర్తి – ప్రేమతో భూమికి దిగివచ్చిన యేసు క్రీస్తు జననాన్ని స్మరించుకునే హృదయాన్ని తాకే తెలుగు క్రైస్తవ భక్తిగీతం.
ఈ పాటలో యేసు క్రీస్తు తన సర్వమహిమను విడిచిపెట్టి, పాపుల నుద్ధరింప భూమిపై శిశువుగా అవతరించిన కారుణ్య స్వరూపాన్ని ఆవిష్కరించాం.
ఈ క్రైస్తవ గీతం ద్వారా,
• యేసు క్రీస్తు జనన రహస్యం
• ఆయన కరుణ, ప్రేమ, త్యాగం
• నిత్య జీవము ఇచ్చిన దేవుని కృప
ఈ పాట మీ హృదయాన్ని తాకి, శాంతి మరియు ఆనందాన్ని నింపాలని ప్రార్థన.
🎵 Song Title: కారుణ్యమూర్తి
🎄 Theme: Jesus Birth | Compassion | Salvation
🙏 Language: Telugu
ఈ పాట మీకు నచ్చితే Like చేయండి, Share చేయండి మరియు Channel Subscribe చేయండి.
దేవుడు మీకు ఆశీర్వదించుగాక ✝️
ఆ.....ఆ.....పశువుల పాకలో శిశువుగా నీవు ఉదయించేవా.. దేవా
పశువుల పాకలో శిశువుగా నీవు ఉదయించేవా.... దేవా
కసవుతో నిండిన పశువుల తొట్టియే,
కసవు తో నిండిన పశువుల తొట్టి యే
పాన్పు ఆయెనా... వసుధలో నీకు
పశువుల పాకలో శిశువుగా నీవు ఉదయించేవా ....దేవా
ఆలమందలే జోలలు పాడ
పరమదూతలు పాడి స్తుతించ ...
ఆలమందలే జోలలు పాడ
పరమదూతలు పాడి స్తుతించ
గొల్ల బోయలే చల్లగా కొలువ-
ఉల్లము పాపిది సంతసిల్లగా
పశువుల పాకలో శిశువుగా నీవు ఉదయించేవా ..దేవా
తారక నీదు దారిని జూప
తూరుపు జ్ఞానులు కోరి వెంటాడ...
తారక నీదు దారిని జూప
తూరుపు జ్ఞానులు కోరి వెంటాడ
కూరిమితో ఈ ధరణిలో
కారుణ్యమూర్తిగా అవతరించితివా
పశువులపాకలో శిశువు నీవు ఉదయించేవా దేవా
ఉర్వి పాపుల నుద్ధరింప నీ
సర్వమహిమను విడచుట చేత ,
ఉర్వి పాపుల నుద్ధరింప నీ
సర్వమహిమను విడచుట చేత
కేవలము పాపుల మగు మాకు
జీవము ..నిత్య జీవము తండ్రీ..
పశువుల పాకలో శిశువుగా నీవు ఉదయించేవా ...దేవా
కసవుతో నిండిన పశువుల తొట్టియే పాన్పు ఆయెనా వసుధలో నీకు
పశువుల పాకలో శిశువుగా నీవు ఉదయించేవా ..దేవా
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: