పందిరిపై టమాటా సాగు || ఎకరాకు 100 టన్నుల దిగుబడి || Tomato cultivation with pendals|| Karshaka Mitra
Автор: Karshaka Mitra
Загружено: 2021-04-07
Просмотров: 371445
Описание:
Bumper yields in Tomato cultivation through Pendal system.
Success Story of Tomato farming with Pendal System by Talluri Papa Rao
టమాటా సాగులో నూతన సాంకేతికతతో అద్భుతాలు చేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతు || ఎకరాకు 100 టన్నుల దిగుబడి పక్కా.
పంట బాగా పండించి, ఆర్థికంగా లాభం పొందటమే రైతు లక్ష్యం. అయితే నాణ్యమైన పంట వుత్పత్తిని మార్కెట్ కు అందించటం రైతు యొక్క సామాజిక బాధ్యత. వీటన్నిటిని సుసాధ్యం చేస్తూ... రైతు ఆశించిన లక్ష్యానకి చేరువ చేస్తోంది పందిరి విధానంలో టమాటా సాగు. 7 అడుగుల ఎత్తు పెరిగిన మొక్కలను, ఎటువంటి ఒత్తిడికి గురవకుండా పందిరిపైకి పాకించారు. తోట నాటి 5నెలలు అయినా ఇప్పటికీ... ప్రతి మొక్క నిండా గుత్తుగుత్తులుగా కాపు వుండటం, ఇంకా పూత, పిందె వస్తుండటం విశేషం. టామాట సాగులో నూతన టెక్నాలజీతో అద్భుతాలు చేస్తన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాత నగర్ మండలం, సుజాత నగర్ గ్రామ అభ్యుదయ రైతు తాళ్లూరి పాపారావు. పందిరి విధానంలో గత నవంబరులో టమాటా నాటి, తోటను అభివృద్ధి చేసిన ఈయన, ఇప్పటికే ఎకరాకు 62 టన్నుల దిగుబడి సాధించారు. మే నెల వరకు మరో 35 నుండి 40 టన్నుల దిగుబడిని సునాయసంగా సాధిస్తానని దీమాగా చెబుతున్నారు. బాక్సుకు 25 కిలోల టమాట చొప్పున మార్కెట్ చేస్తున్న ఈయన ఇప్పటివరకు 2500 బాక్సులు మార్కెట్ చేసారు.
కూరగాయల సాగులో అందివచ్చిన ఆధునిక పరిజ్ఞానానికి, స్వానుభవాలను జోడించి గత 10 సంవత్సరాలుగా తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటున్న తాళ్లూరి, పంట పండించటంలో ప్రయోగాలకు పెద్దపీఠ వేస్తారు. ఈసారి టమాటాను పందిరి పైకి పాకించి, ఎకరానికి 100 టన్నుల దిగుబడిని అందుకునే అత్యుత్తమ లక్ష్యాన్ని ఛేదించారు. పాదుజాతి కూరగాయలను పాకించే ఈ పందిరిలో, పోల్స్ మధ్య 16 అడుగుల దూరం వుండగా, వీటి మధ్య మరో వరుసలో గుంజలను పాతి, వరుసల మధ్య 8 అడుగుల దూరంతో టమాట నాటారు. పందిరి వుండటం వల్ల మొక్కలను పైకి పాకించటం సులభంగా మారింది. దీంతో టామటా ద్రాక్షగుత్తుల్లా వేలాడుతూ పందిరిపై విరగ కాసింది. ఈ ఏడాది 30 ఎకరాల్ల దఫదఫాలు టమాట నాటిన ఈ రైతు, ప్రస్థుతం 5 ఎకరాల పంటను మాత్రం పందిరి కింద సాగుచేసారు. నేలపై పండించటం, స్టేకింగ్ చేయటం వంటి పద్ధతులకన్నా పందిరి విధానం మంచి విజయాన్ని అందించిందని రైతు చెబుతున్నారు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
#karshakamitra #tomatofarminginpendals #tomatocultivation
Facebook : https://mtouch.facebook.com/maganti.v...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: