నాస్తికులైన నార్ల వారి రోగాన్ని యోగమార్గంలో నయం చేసిన వేటూరి | Mastre CVV | Veturi | Rajan PTSK
Автор: Ajagava
Загружено: 2024-04-06
Просмотров: 5884
Описание:
నార్ల వెంకటేశ్వరరావు గారికిCVV యోగమార్గంలో తలనొప్పి తగ్గించిన వేటూరి ప్రభాకరశాస్త్రిగారు.
తెలుగువారందరకీ ప్రాతఃస్మరణీయులు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు. ఈరోజు మనమంతా అన్నమాచార్యుల వారి కీర్తనలను విని ఆనందిస్తున్నామంటే అందుకు ప్రధాన కారకులు ప్రభాకరశాస్త్రిగారే. అమ్మమాచార్య సంకీర్తనా భాండాగారాన్ని వెలికి తీసిన మహాపురుషుడాయన. అలానే తొలి తెలుగు పదం “నాగబు” గురించి లోకానికి తెలియజెప్పి తెలుగు భాష ప్రాచీనతను చాటిచెప్పిన పరిశోధకుడాయన. వందలయేళ్ళుగా జానపదుల పాడుకునే కూనలమ్మ పదాలు వంటి ఎన్నో బాలల గేయాలను సంకలనం చేసి వాటిని బాలభాష పేరుతో తొంభై ఏళ్ళ క్రితమే మనకందించినవారాయన. మరుగున పడిపోయిన ఎన్నో ప్రాచీన గ్రంథాలను పరిష్కరించి, పీఠికలు వ్రాసి ప్రచురించి, తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవచేసిన పరిశోధక పండితుడాయన. ప్రభాకర శాస్త్రిగారు కేవలం పరిశోధకుడు, పండితుడు మాత్రమే కాదు. శతావధాని, కవి, రచయిత కూడా. అసలు భాషా పరిశోధన, చారిత్రక పరిశోధన ఏ విధంగా చేయాలో అన్నదానికి ఒక విశిష్టమైన మార్గం చూపిన తొలి తెలుగువాడాయన. నిజానికి వేటూరి ప్రభాకరశాస్త్రిగారి గురించి చెప్పుకోవాలంటే అన్నీ ఇన్నీ విశేషణాలు సరిపోవు. ఈరోజు మనం ఆయన యోగమార్గంతో చేసిన వైద్య పరమైన ఒక అద్భుతం గురించి చెప్పుకుందాం.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: