శంకరాచార్యులు - సనాతన ధర్మం | Adi Sankaracharya | Rajan PTSK
Автор: Ajagava
Загружено: 2024-05-12
Просмотров: 16261
Описание:
శంకర జయంతి!
సుమారు 2500 సంవత్సరాల క్రితం బౌద్ధం జైనం చార్వాకం వంటి 72 అవైదిక మతాలు లోకంలో విస్తృతంగా వ్యాపించాయి. ఆ యా మత ప్రవర్తకులు మరణించాక వారిలో కూడా తెగలు పుట్టి, విచ్చలవిడి భావాలు, ఆరాధనలూ పుట్టుకొచ్చాయి. ఎవరికివారు తమ సిద్ధాంతమే గొప్పదని వాదిస్తూ, వర్గాలను ఏర్పరచుకోవడంతో ప్రజలమధ్య వైషమ్యాలు మొదలయ్యాయి. కాపాలికం, కాలాముఖం, భైరవం వంటి క్రూరపూజావిదానాలతో పాటూ, ఎన్నోరకాల క్షుద్రపూజలు, నరబలులు ప్రబలాయి. నీతినియమాలు, వావివరసలు కట్టుతప్పాయి. స్వార్థపరత్వం, పరపీడన ఎక్కువయ్యింది. తప్పు తప్పేకాదని అదీ ఒకరకంగా ఒప్పేనని చెప్పే అర్థంలేని వ్యాఖ్యానాలు బయలుదేరాయి. దానితో సమాజజీవనం అస్తవ్యస్తమయ్యింది. భయం, ఆందోళన రాజ్యమేలాయి. ఎటుచూసినా అజ్ఞానమే, అందరి మనసుల్లోనూ అంధకారమే. అటువంటి స్థితిలో యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతా అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటూ ఆనాడు కృష్ణపరమాత్మగా తానిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి నిరంతరనిశ్చలజ్ఞానముద్రాస్వరూపంతోబ్రహ్మానందస్థితిలో ఓలలాడే ఆ స్వామి, సకలచరాచరా జగత్తును సృష్టిస్థితిలయతిరోధానఅనుగ్రహాలనే పంచకృత్యాలతో అతి సునాయాసంగా నిర్వహించే ఆ ప్రభువు, తనదికానిదంటూ ఏదీలేని, తాను కానిదంటూ ఏదీకాని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన పరమాత్మ, తన డమరుధ్వనితో అక్షరాన్ని పుట్టించి లోకానికి జ్ఞానాన్ని ప్రసాదించిన ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్త్వానికి సగుణ సాకార స్వరూపమైన ఆ లోకైకనాథుడు పరమశివుడు ధ్యానస్థితినుండి కనులు తెరిచాడు. అపారకరుణాసముద్రుడైన ఆ స్వామి జగత్తును ఉద్ధరించడానికై కైలాసాన్ని వీడి కాలడి వైపుగా కదిలాడు. ఆర్యాంబ, శివగురు దంపతుల ముద్దుబిడ్డగా నందన నామ సంవత్సరం, వైశాఖ శుద్ధ పంచమినాడు, అభిజిత్ లగ్నంలో, ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉండగా ఆర్ద్రా నక్షత్రంలో ఈ భూమిపై అవతరించాడు. ఆదిశంకరుడన్న పేరుతో పరివ్రాజకాచార్యుడై.. లోకాంధకారాన్ని పటాపంచలు చేసే సుజ్ఞానజ్యోతిగా వెలిగాడు. ఆసేతు హిమాచలం పర్యటించి అవైదిక మత ఖండన, అద్వైత సిద్ధాంత స్థాపనా చేశాడు. కవిపండితసకలమతాచార్యుల సమక్షంలో కాశ్మీరంలోని సర్వజ్ఞపీఠం అధిష్ఠించి.. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం అని నిత్యం మనం స్మరించుకునే జగద్గురువయ్యాడు. ఈరోజు వైశాఖ శుద్ధ పంచమి. జగద్గురు ఆదిశంకరుల వారి జయంతి. ఈ పుణ్యతిథినాడు ఆ మహాపురుషుని గురించి నాలుగు మాటలు చెప్పుకుందాం.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: