డబ్బులే లేవనిఅయినవాళ్లే అలుసుగా చూస్తున్నారా…
Автор: KVS
Загружено: 2026-01-02
Просмотров: 368
Описание:
#love #music #new husband and wife#song #emotional
own lyrics
plzz Like Share Subscribe My channelడబ్బులే లేవని
అయినవాళ్లే అలుసుగా చూస్తున్నారా…
గూడు లేదని
గుమ్మాల దగ్గరే ఆపేస్తున్నారా…
బంగారం లేదని
పసుపు తాళిని తక్కువ చేస్తున్నారా…
నువ్వెంత అంటూ
మా బతుకునే భారం చేస్తున్నారా…
కటిక చీకటిలో ఉన్నామనీ
వెలుగులే లేవనుకుంటున్నారా…
కాలం ఎల్లకాలం ఒకలా ఉండదని
మర్చిపోయారా…
రేపటి రోజులు మా వంతు అనుకుంటే
ఈ కష్టాలన్నీ
కన్నీటి బొట్టై జారిపోతాయమ్మ…
ఊరోళ్ళు ఎవ్వరూ వద్దనుకున్నా
మనకు మనమే బంధువులం
గుడిసెలో బ్రతుకులు మావి కావచ్చు
కంచంలో కూడుకు
ఎన్నడూ కరువు లేదు
బట్టకు ఎప్పుడూ కొదవలేదు…
గుడిసెను రేపటి మిద్దెగా మార్చే
కష్టమే మా తోడు ఉంది
డబ్బు డబ్బు అంటారు
మీరు అందరూ
డబ్బుతో కొనలేరు సంతోషం
డబ్బుతో ముడిపడలేదు
ఏ బంధమూ…
మట్టి గాజుల అందము
పసిడి గాజులో ఉండేనా
తాళి అంటే కాదు బంగారము
బతుకు నిచ్చిన వాడి సౌభాగ్యము
డబ్బు చూడని ప్రేమ మాదేనమ్మా..
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: