నువ్వే లేకుంటే ఓ అమ్మనాకు ఉందా ఈ జన్మ
Автор: KVS
Загружено: 2025-12-21
Просмотров: 1013
Описание:
#love #mother song#music #new
own lyrics
నువ్వే లేకుంటే ఓ అమ్మ
నాకు ఉందా ఈ జన్మ
కడుపున నన్ను మోసే వేళ
కలతలెన్నో నీకున్న
నీ కల నేనే అన్నావు
నీ ఊహల్లో నా రూపం
ఊపిరిలా బ్రతికావు
ప్రతి క్షణం...
నా స్పర్శ కోసం
నువ్వెంత చూశావో
నీ వడి చేరువవేళ
పొంగిన కన్నీటి ఆహ్వానం
నే మరువనమ్మా…
నే మరువనమ్మా…
పాలబువ్వ తినిపించే వేళ
పన్నీటి స్నానం చేయించి వేళ
నన్ను చూసి
నువ్వెంత మురిసావో అమ్మ
నే నిద్రించే వేళ
జోలలెన్నో పాడావు
జాబిలమ్మని చూపావు
తప్పటడుగులు వేసి
తడబడిన వేళ
నడక నేర్పి నాకే
తొలి గురువైనావు
అక్షర జ్ఞానం నేర్పి
తొలి దైవానివైనావు
నన్ను నడిపించి వేల
నా తొలి వెలుగైనావు
అమ్మ.....
అలసటను మరిచావు
బాధలన్నీ దాచావు
నీ ఇష్టం మరిచి
నాకోసం బతికావు
నీ జీవితం నాకై
నిశ్శబ్దంగా అర్పించావు
మరుజన్మే నాకుంటే
ఓ అమ్మ…
నా బిడ్డగా నువ్వే పుట్టే
ఆ వరమే ఇవ్వమ్మా
ఓ అమ్మ....
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: