ఓ పితా ఓ పుత్రా ఓ పవిత్రాత్మ దేవుడా | Jesus Latest Song |Telugu Christian Song | Panchagayalu |
Автор: PANCHAGAYALU
Загружено: 2025-11-22
Просмотров: 53182
Описание:
Welcome to Panchagayalu Devotional Channel 🙏
పితా-పుత్రా- పవిత్రాత్మ - నామమున ఆమెన్ 👏
"ఓ పితా ఓ పుత్రా ఓ పవిత్రాత్మ దేవుడా" ఈ పాట మీ అందరికీ తప్పక నచ్చుతుందని ఆశిస్తున్నాను.
దేవుని సృష్టి, హవ్వ ఆదాములు దేవుని ఆజ్ఞ మీరి చేసిన పాపం, దూరమైన యేసయ్య స్నేహం, ఆ కరుణామయుడు మనల్ని కరుణించి, తన రక్తం చిందించి..మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు. మనపై ప్రేమ, కరుణ, జాలి, దయ చూపిస్తూ..తన స్నేహాన్ని మనకు పంచుతూ..మనతోనే, మనలోనే వసించి ఉంటున్నాడు.
ఈ పాట మీకు ఆధ్యాత్మిక చింతన, మానసిక ప్రశాంతత, పరివర్తన కలిగిస్తుందని భావిస్తున్నాను. మీ ఆదరణ, ఆప్యాయత, ప్రోత్సాహం కోరుచున్నాను.
Lyrics:
[పల్లవి]
ఓ పితా.. ఓ పుత్రా..
ఓ పవిత్రాత్మ దేవుడా..
జన్మ జన్మ కు తోడుగా
నా వెంట రావయ్య నను వీడకా
[చరణం 1]
హవ్వ ఆదాము ఆది జంటగా
ఏదెను తోటలో చేసిన పాపమే
శాపముగా మారి ఎడబాపె స్నేహము
విని నీవు చేరుకో ఓ మనసా
క్రీస్తు సన్నిధికి నా మనసా [ఓ పితా..]
[చరణం 2]
దైవకుమారా ఓ మెస్సయా
లోక రక్షకా నా యేసయ్యా
సిలువ పైన నీ చిందిన రక్తం
సర్వ పాపముల పరిహారం
నాపై కొంచెం చిలకరించవా
నన్ను పరిశుద్ధ పరచవా [ఓ పితా..]
[చరణం 3]
ప్రేమ జపముతో ప్రేమించితిని
భక్తి జపముతో భజియించితిని
నమ్మిక జపముతో నమ్ముకొంటిని
విశ్వాస జపముతో విశ్వసించితిని
స్తుతి స్తోత్రములు చెల్లించితిని
ఘనపరచితిని మహిమపరచితిని
ఆరాధిస్తూ... నీ నీడ చేరితిని [ఓ పితా..]
[చరణం 4]
బంగరు వస్త్రాల మేఘారూఢుడా
లంగరు వేశావు నావకూ...
నా హృదయ నావకూ ...
పరిశుద్ధాత్మ తో నింపుమయ్య
నీ వాక్కు నా నోట పలుకుమయ్య
[ముగింపు]
[బృందం]
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
[శుభం]
Lyrics: Pasupuleti Srinivasa Rao
Music & Vocals: AI
With Love..❤️
Yours Pasupuleti Srinivasa Rao
#jesus #teluguchristiansongs #jesusnewsong #jesuslatestsong #telugunewsongs #jesussongstelugu #telugujesussongs #trending #music #viralvideo #youtubevideos #popular #panchagayaalu
Please like, share, comment and subscribe
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: