పుష్యమాసంలో యువత-ఆధ్యాత్మిక దారిలో నడవాలి Adivasi's Youth Walk on the spiritual path Adilabad Distc
Автор: The Thukaram Channel
Загружено: 2025-12-25
Просмотров: 7501
Описание:
Adilabad Dist|Pushya Month|Adivasi Community People Grand Celebrate Pushya Month is Very Special Adivasi's Community అడవిని నమ్ముకొని… ప్రకృతిని ఆరాధిస్తూ.. పర్యావరణాన్ని పరిరక్షిస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసి గిరిజనుల జీవన శైలి వైవిద్యభరితంగా ఉంటుంది. భిన్నమైన ఆచారాలు, సంప్రదాయాలతో వారు తమ ప్రత్యేకను ఇప్పటికి కొనసాగిస్తున్నారు
అడవిని నమ్ముకొని ప్రకృతిని ఆరాధిస్తూ.. పర్యావరణాన్ని పరిరక్షిస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసి గిరిజనుల జీవన శైలి వైవిద్యభరితంగా ఉంటుంది. భిన్నమైన ఆచారాలు, సంప్రదాయాలతో వారు తమ ప్రత్యేకను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కొండలు గుట్టలు గుహల్లో కొలువైన తమ ఆరాధ్య దైవాలను దర్శనం చేసుకునేందుకు దూరభారమైనా కాలినడకన, ఎడ్లబండ్లపైన వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. అంతగా తమ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీఠవేసే ఉమ్మడి జిల్లాలోని ఆదివాసి గిరిజనులకు పుష్య మాసం అంటే ఎంతో ప్రీతికరమైంది, పవిత్రమైంది. వారి కుల దైవాలకు, పెర్సపేన్ కు ఈ నెలలోనే ప్రత్యేక పూజలు చేస్తారు. జాతర మహోత్సవాలు కూడా జరుపుతారు. ఈ నెలంతా పూజలు, మొక్కుల్లో ఇక్కడి గిరిజనులు మునిగితేలుతారు. దేవుళ్ల పేరిట దీక్షలు కూడా చేపడతారు. జిల్లాలోని గిరిజన గూడాల్లో ఎటు చూసినాఆధ్యాత్మిక వాతావరణమే నెలకొని ఉంటుంది.ఇప్పటికే కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలంలోని కోట పరందోలి అటవీ ప్రాంతంలో గుహల్లో వెలసిన జంగుబాయి క్షేత్రంలో జాతర మహోత్సరం కొనసాగుతోంది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కేంద్రంలోని వాగోబా ఆలయంలో రెండు రోజుల్లో ఖాందేవుడి జాతర కూడా మొదలు కాబోతోంది. ఇక వచ్చేనెల తొమ్మిద తేదీ నుండి ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో నాగోబా జాతర కూడా మొదలు కాబోతోంది. ఇప్పటికే మెస్రం వంశ గిరిజనులు నాగోబా జాతరకు సంబంధించిన సన్నాహాలను మొదలు పెట్టారు. పుష్య అమావాస్య రోజున నాగోబాకు జరిపే అభిషేకం, మహాపూజకు అవసరమైన గంగా జలం కోసం కాలినడకన బయలుదేరి వెళ్ళారు. ఇది రాష్ట్రంలో జరిగే గిరిజన జాతర ల్లో రెండవ అతిపెద్ద జాతర. మెస్రం వంశ గిరిజనులే కాకుండా ఇతర గిరిజన తెగల వారు కూడా నాగోబా జాతరకు వచ్చి మొక్కులు తీర్చుకొని వెళతారు. అటు ఈ జాతర ముగిసిన వెంటనే ఇదే మండలంలోని శ్యాంపూర్ బుడుందేవ్ జాతర మొదలవుతుంది.కళా బృందాలకు దరఖాస్తుల ఆహ్వానం.. ఎక్కడంటే..మరోవైపు ఇదే నెలలో కొలాం గిరిజనులు కూడా తమ ఆరాధ్య దైవమైన భీమయ్యక్ పూజలను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. అయితే ఈ మాసంలో దేవతల వద్ద జరిపే పూజలకు ఉపయోగించే నూనెలను గిరిజనులు స్వయంగా తయారు చేసుకుంటారు. బయట ఎక్కడా కొనుగోలు చేయరు. సంప్రదాయపద్దతిలో చెక్క గానుగతో నువ్వులు, ఇప్పపరక నూనెలను తయారు చేస్తారు. ఖాందేవ్ జాతరలో ఇలా తీసినదే రెండు కిలోల నూనెను తొడసం వంశ ఆడపడుచు తాగే ఆచారం కూడా ఉంది. కాగా ఈయేడాది సమ్మక్క సారలమ్మ జాతర కూడా రావడంతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత గిరిజనులు మేడారం జాతరకు కూడ తరలివెళ్ళే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లాలో జరిగే గిరిజన జాతరలకు ఇరుగు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుండి కూడా గిరిజనులు తరలివస్తారు. మొత్తం మీద నెల రెండు నెలలు గిరిజనుల సంప్రదాయ పూజలు, జాతరలతో ఉమ్మడి జిల్లాలో సందడి నెలకొననుంద
ఇప్పటికే కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలంలోని కోట పరందోలి అటవీ ప్రాంతంలో గుహల్లో వెలసిన జంగుబాయి క్షేత్రంలో జాతర మహోత్సరం కొనసాగుతోంది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కేంద్రంలోని వాగోబా ఆలయంలో రెండు రోజుల్లో ఖాందేవుడి జాతర కూడా మొదలు కాబోతోంది. ఇక వచ్చేనెల తొమ్మిద తేదీ నుండి ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో నాగోబా జాతర కూడా మొదలు కాబోతోంది. ఇప్పటికే మెస్రం వంశ గిరిజనులు నాగోబా జాతరకు సంబంధించిన సన్నాహాలను మొదలు పెట్టారు. పుష్య అమావాస్య రోజున నాగోబాకు జరిపే అభిషేకం, మహాపూజకు అవసరమైన గంగా జలం కోసం కాలినడకన బయలుదేరి వెళ్ళారు. ఇది రాష్ట్రంలో జరిగే గిరిజన జాతర ల్లో రెండవ అతిపెద్ద జాతర. మెస్రం వంశ గిరిజనులే కాకుండా ఇతర గిరిజన తెగల వారు కూడా నాగోబా జాతరకు వచ్చి మొక్కులు తీర్చుకొని వెళతారు. అటు ఈ జాతర ముగిసిన వెంటనే ఇదే మండలంలోని శ్యాంపూర్ బుడుందేవ్ జాతర
మరోవైపు ఇదే నెలలో కొలాం గిరిజనులు కూడా తమ ఆరాధ్య దైవమైన భీమయ్యక్ పూజలను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. అయితే ఈ మాసంలో దేవతల వద్ద జరిపే పూజలకు ఉపయోగించే నూనెలను గిరిజనులు స్వయంగా తయారు చేసుకుంటారు. బయట ఎక్కడా కొనుగోలు చేయరు. సంప్రదాయపద్దతిలో చెక్క గానుగతో నువ్వులు, ఇప్పపరక నూనెలను తయారు చేస్తారు. ఖాందేవ్ జాతరలో ఇలా తీసినదే రెండు కిలోల నూనెను తొడసం వంశ ఆడపడుచు తాగే ఆచారం కూడా ఉంది. కాగా ఈయేడాది సమ్మక్క సారలమ్మ జాతర కూడా రావడంతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత గిరిజనులు మేడారం జాతరకు కూడ తరలివెళ్ళే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లాలో జరిగే గిరిజన జాతరలకు ఇరుగు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుండి కూడా గిరిజనులు తరలివస్తారు. మొత్తం మీద నెల రెండు నెలలు గిరిజనుల సంప్రదాయ పూజలు, జాతరలతో ఉమ్మడి జిల్లాలో సందడి నెలకొననుంది.
#adivasi#jangubai#tribalindia#adilabadnews#telangananews#gondwana#gondipata#gondipata#pershapen#adilabadnews#telangana
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: