అరుణాచల శివ భజన/ ARUNACHALA BHAJAN
Автор: Sivakrishna Vakamullu
Загружено: 2024-03-08
Просмотров: 2788
Описание:
॥అరుణాచల శివ భజన॥
#Om Namahshivaya #Arunachala siva #Ramana Maharshi #Telugu pata #Telugu Bhakti bhajan #Devudu #Gyanam #Moksham #Mahashivaratri #Yogam #Mukthi #Telugu Janapadam #Thatvalu
Credits:
Lyrics - Sivakrishna Vakamullu
Music Director - Srinivas Sharma
Singers:
I. Srinivas Sharma
II. Ravi Prakash
III. Meghana Naidu
IV. Lekhya Veera
Keyboard Programmed, Mixing and mastering by - Manoj Busam
Studio - Jazz Studios
——————————-
అరుణాచల అరుణాచల అరుణాచల శివ
అరుణాచల అరుణాచల అరుణాచల శివ
బూడిదతో భాస్కకరుడై భూతనాధ శివ!
భువి వెలుగగ ఆడుతావు నటరాజై శివ!
మంచుకుప్ప కప్పుకునే మాదేవా శివ !
అగ్గిలోన ఆరుతావు అరుణాచల శివ!
ఆకలిలో అన్నమయ్యి ఆదుకునే శివ!
రోగమిచ్చి ఔషదమౌ చేదుతోవ శివ!
రాగమిచ్చి రాజునైన వంచుతావు శివ!
భోగమిచ్చి బంటునైన పెంచుతావు శివ!
గుణమునిచ్చి గురువువయ్యి ఎంచుతావు శివ!
గణమునిచ్చి అహముపెంచి తెంచుతావు శివ!
బలమునిచ్చి బరితెగింపు నేర్పుతావు శివ!
అలుపునిచ్చి అదుపుచేయు నేర్పునీది శివ!
దేహముకో దాహమిచ్చి సృస్టి జరుపు శివ!
కామముతో కాన్పునిచ్చి కట్టినావు శివ!
నిద్రనిచ్చి నిన్నునీవె మరుపుతావు శివ!
మేలుకొలపి నన్నునిన్ను కలుపుతావు శివ!
రూపునిచ్చి రుచినిచ్చి జన్మనిచ్చు శివ!
వాసనతో వానరాన్ని చేసినావు శివ!
వేలవేల జన్మలెత్తి విసిగినాను శివ!
కాలముసుగు తీసి కన్ను తెరిపించుము శివ!
ఏదిక్కున ముఖముందని వెదికినాను శివ!
ఎటుతిరిగిన ఒకేముఖం లింగమూర్తి శివ!
భక్తియుక్తి కర్మమర్మ బోధచేయు శివ!
ముక్తిమోక్ష బాటవేయు భష్మధారి శివ!
ఎతికిఎతికి అలిసినాను ఎదురు రావు శివ!
మదినతిరిగి మనసుపోతె మిగిలినావు శివ!
నామరూపపాపశాప పావనమయ శివ!
ఏకమయ్యి ఎలిగిపోవు ఎరుకనీయు శివ!
అరనరికిన అమ్మోరికి అమిరినావు శివ!
నమ్మానని మరుజన్మలు నరికినావు శివ!
దేశాలకుకాలాలకు దొరకరావు శివ!
దేహంలో దేవులాడ దొరకెదవో శివ!
కన్నుగప్పి అడ్డగీత రాసినావు శివ!
కన్నుతెరిపి నిలువకంట నిలిచినావు శివ!
తిరుగుతున్న దారులన్ని మూసినావు శివ!
తిరుగులేని ద్వారమొకటి తెరిచినావు శివ!
నెత్తిమీద గంగఉన్న నీరాడవు శివ!
సంసారపు సాగరాన తడనీయవు శివ!
వేరులేని వృక్షానికి తీరునీవు శివ!
వేరుకాని వరమునియ్యు జ్ఞానమూర్తి శివ!
దక్షిణాన పతనమయ్యి దాసుడైతి శివ!
ఉత్తరాన వెలగనివ్వు జ్ఞానజ్యోతి శివ!
చీకటింటి గుహలోన చిద్విలాస శివ!
శివమెత్తిన జ్యోతిలాగ మూడంగుల శివ!
కపాలాన్ని కడతేర్చే కరుణచూపు శివ!
నివురులేని నిజఅగ్నిన నిలుపునన్ను శివ!
అరుణాచల అరుణాచల అరుణాచల శివ
అరుణాచల అరుణాచల అరుణాచల శివ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: