పొన్నూరు శ్రీనివాసులు మరో చాగంటి, గరికిపాటి లా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నత స్థితికి రావాలి - MP మాగుంట !
Автор: AP 27 News
Загружено: 2026-01-11
Просмотров: 377
Описание: పవిత్రమైన ధనుర్మాసంలో తిరుప్పావై ప్రవచనాలను వినడం ఎంతో మంచిదని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి అన్నారు. ఒంగోలు గాంధీ రోడ్డులోని గీతా మందిరంలో గత 26 రోజు లుగా నిర్వహిస్తున్న తిరుప్పావై ప్రవచన కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్బంగా తిరుమల తిరుపతి దేవస్దానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఉపన్యాసకులు పొన్నూరి వెంకట శ్రీనివాసు లు చేసిన తిరుప్పావై ప్రవచనాన్ని ఆయన విన్నారు. అనంతరం మందిరంలోని శ్రీ కృష్ణభగ వానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీని వాసులు రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, ఎంతో పురాతనమైన గీతామందిరంలో ఇంత మంచి కార్యక్రమా న్ని ప్రతి ఏటా నిర్వహించడం ఎంతో విశేషమన్నారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తున్న పొన్నూరు వెంకట శ్రీనివా సులును ఆయన అభినందించారు. తన సొంత బాణితో ప్రేక్షకులు మెచ్చే విధంగా ఆధ్యాత్మిక ఉపన్యాస కులను నిర్వహిస్తున్న పొన్నూరు వెంకట శ్రీనివాసులు మరో చాగంటి, మరో గరికిపాటి నరసింహారావు లా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నత స్థితికి రావాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ గోదాదేవి ఆశీస్సులు లభిం చాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గీతామందిరం అధ్యక్షులు తాతా శ్రీనివాసులు, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాత ప్రసాద్, బాపూజీ కాంప్లెక్స్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు చెంచయ్యగుప్త, ఏల్చూరి అనంతలక్ష్మి, చల్లా నాగేశ్వరమ్మ, ఐ.మురళీకృష్ణ, మొవ్వ నాగేశ్వరరావు, ఆకుల శ్రీనివాసరావు, కల్లగుంట కృష్ణయ్య, ఎన్నూరి నాగేశ్వరరావు, యత్తపు కొండారెడ్డి, ఆదిమూలపు సుబ్బారావు, గీతా మందిరం భక్త బృందం కృష్ణ, సురేఖ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: