వెనుజులపై అమెరికాఉగ్రదాడినిఖండించండి. మధురో దంపుతులను తక్షణమే విడుదలచేయాలి. CPM
Автор: Seema News
Загружено: 2026-01-05
Просмотров: 63
Описание: వెనిజులా పై అమెరికా ఉగ్రదాడిని ఖండించాలని మధురో దంపతులను తక్షణమే విడుదల చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ డిమాండ్ చేశారు. ఈరోజు వెనుజులా పై అమెరికా ఉగ్రదాడిని ఖండిస్తూ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఎం పార్టీ న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ అమెరికా గత 20 సంవత్సరాల నుండి ఎలాగైనా వెరిజులాపై తన ఆధిపత్యాన్ని కొనసాగించాలనే కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగిందని ఈ దాడి అమెరికా సామ్రాజ్యవాదం యొక్క దాస్టికానికి ప్రతీకా అని ఆయన ఘాటుగా విమర్శించారు. ఒక ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ఆ దేశ అధ్యక్షుడు మధురోను బంధించి తీసుకొని వెళ్లడం దుర్మార్గమని ఆయన విమర్శించాడు. అమెరికా సామ్రాజ్యవాద దాడిని ఖండిస్తూ కర్నూలు నగరంలోని ప్రముఖ డాక్టర్లు భరత్, నాగభూషణం, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్థిక విశ్లేషకుడు మన్సూర్ రహిమాన్ పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి రామకృష్ణ, కెవి నారాయణ, ప్రజాశక్తి మేనేజర్ నరసింహ, సిఐటియు నాయకులు వెంకట్ పాల్గొని మాట్లాడుతూ అమెరికా దాడిని ఖండించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర నాయకులు రఫీ, దివాకర్, ppss నాయకులు నాగరాజు, కెవిపిఎస్ నాయకులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: