ఏ.పి అసైన్డ్’ కు మళ్లీ సవరణ..|| Sagevideos || Sage Media
Автор: Sage Media
Загружено: 2025-11-11
Просмотров: 29910
Описание:
#assignment #revenuerecord #letestnews #sagevideo #apgovernment
ఏ.పి అసైన్డ్’ కు మళ్లీ సవరణ..
పేద ప్రజలకు ఎంతోకొంత ఆసరాగా ఉండే అసైన్డ్ భూములను మాయమాటలతో వారి వద్ద నుండి గుంజుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అసైన్డ్‌భూముల బదిలీలను నిషేదిస్తూ 1977లో రూపొందించిన చట్ట స్ఫూర్తిని నీరుగారుస్తూ ఇప్పటికే కొన్ని సవరణలు జరగ్గా, తాజాగా మరో సవరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగల్ ఇచ్చింది. అత్యవసరం కావడంతో ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. వాస్తవానికి ఈ మేరకు రూపొందించిన బిల్లు గత అసెంబ్లీ సమాశాల ముందుకు వచ్చింది. అయితే, బిల్లు ఆమోదం పొందకముందే ఉభయసభలు వాయిదా పడటంతో తాజాగా ఆర్డినెన్స్ జారీ చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ సవరణతో అసైన్డ్ భూములను 99 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వడానికి అవకాశం కలుగుతుందని మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు వివరించిన పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధి తెలిపారు. ప్రభుత్వం ‘లీజు’ అని చెబుతున్నప్పటికీ ఆచరణలో ఈ నిర్ణయం ఎవరికి మేలు చేస్తోందో. 99 ఏళ్ల తరువాత భూములపై అధికారం ఎవరి వద్ద ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్లీన్ ఎనర్జీపాలసీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు.
#appolitics #apgovernment #andhrapradesh #apnews #telugunrws #assignmentland #revenuerecord #tdpgovernment #youtubevideos
https://www.instagram.com/sage31jly?i...
https://www.facebook.com/share/fUzSs2...
https://x.com/ThullimelliK?t=MLgRjPfD...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: