మాయమై పోతున్నడమ్మా/telugu lyrics/గానం: కవి తిరుపాలు గారు/ రచన : అందెకవి/ కన్నమడకల భజన పోటీ
Автор: SR NAIDU TV
Загружено: 2024-11-01
Просмотров: 325618
Описание:
మాయమై పోతున్నడమ్మా మనిషన్న వాడు/గానం: కవి తిరుపాలు గారు/ రచన : అందెకవి/ కన్నమడకల భజన పోటీ
__&&&____________________________________
పహాడీ రాగం - ఖండగతి తాళం
చీమల దండు సినీ గీతం. గాయకులు: వందేమాతరం శ్రీనివాస్ అందె కవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు,
పల్లవి: మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు...
మచ్చుకైనా లేడు చూడు
మానవత్వము ఉన్నవాడు
నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు
యాడ ఉన్నాడో కాని కంటికి కనరాడు "మాయ"
చరణం : నిలువెత్తు స్వార్ధము నీడల వస్తుంటే
చెడిపోక ఏమైతాడమ్మ...
ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల
దిగజారుతున్నాడోయమ్మా...
అవినీతి పెను ఆశ అంధకారములోన
చిక్కిపోయి రోజు శిథిలమైతునాడు "మాయ"
చరణం: ఇనుప రెక్కల డేగ విసిరిన పంజకు
కోడిపిల్లై చిక్కి కొట్టుకుంటున్నాడు.
ఉట్టికి స్వర్గానికందకుండ తుదకు
అస్థిపంజరమై అగుపించనున్నారు - 2
కదిలే విశ్వము తన కనుసనలో నడువ
కనుబొమ్మలెగరేసి కాలగమనములోన"మాయ"
చరణం:కుక్కనక్కల దైవరూపలుగ కొలిచి
పంది నంది చూసి పడి మ్రొక్కుతుంటడు
చీమలకు చెక్కెర పాములకు పాలోసి
జీవకారుణ్యమే జీవితం అంటాడు
తోడ పుట్టినవాని ఊరవతలికి నెట్టి
కులమంటు ఇలమీద కలహాల గిరుగీసి"మాయ "
చరణం : ఇరవైఐదు పైసలగరొత్తుగాల్చి
అరవైఐదు కోట్ల వరములడుగుతాడు
దైవాలపేరుతో చందాలకై దందా
భక్తిముసుగు తొడగి భలే ఫోజు పెడతాడు
ముక్తిపేరానరుడు రక్తిలో రాజై
రాకాసి రూపాన రంజిల్లుతున్నాడు "మాయ "
--------------------------------------------------------------------------
"Copyright @ {sr naidu tv and 2024}. Any reproduction or illegal distribution of the content in any form will result in immediate action against the person concerned."
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: