ప్రజా గ్రీవెన్స్ నిర్వహించిన- mla భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ
Автор: Rv 99News
Загружено: 2025-12-14
Просмотров: 161
Описание:
జిల్లా : నంద్యాల
సెంటర్: ఆళ్లగడ్డ
స్లగ్గు: వైకాపా నాయకులు ఆధారాలు చూపించి మాట్లాడండి నోటికొచ్చిన్నట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు- ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
యాంకర్ పార్ట్ : ప్రజల సమస్యలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయాలని లక్ష్యంగా చాగలమర్రి ఎంపీడీఓ కార్యాలయం లో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమానికి ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలు ప్రత్యక్షంగా వెల్లడించిన సమస్యలు , వినతులను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వ్యక్తిగతంగా స్వీకరించి ఒక్కొక్కటిగా సమగ్రంగా పరిశీలించారు.
ప్రతి సమస్యను పూర్తిగా విని వెంటనే స్పందిస్తూ , సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యలు చేపట్టేందుకు ఆదేశాలు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ జారీ చేశారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంమని , ప్రజలకు ఇబ్బందులు లేకుండా , ప్రతి సేవను సమయానికి అందించడం మా బాధ్యత అని , ప్రజల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటాం అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమంలో 200 వందలకి పైగా అర్జీ లు రావడం జరిగిందని ప్రతి ఒక సమస్య వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కారం జరిగేలాగా చూడాలని అఖిలప్రియ అన్నారు.
చాగలమర్రి మండలానికి సంబంధించి 4 కోట్ల 42 లక్షల రూపాయలు విలేజ్ హెల్త్ క్లీనింగ్ బిల్డింగ్ లకు కాను 12 గ్రామాలకు ఒక్కో బిల్డింగ్ కు 42 లక్షలు శాంక్షన్ చేయడం జరిగిందని, చాగలమరి మండలానికి సంబంధించి మొదటి విడత NREGS కింద 2 కోట్ల 57 లక్షలు రోడ్లకు ఇవ్వడం జరిగింది రోడవ విడత 2 కోట్ల 60 ఇవ్వడం జరిగిందని ఆళ్లగడ్డ ప్రజల అభివృద్ధి ముఖ్య ధ్యేయం అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు.
ఆళ్లగడ్డలో వైసీపీ నాయకులు ఏదో ప్రెస్ మీట్ పెట్టి రామ్మోహన్ నాయుడు గురించి నా గురించి మాట్లాడడం జరిగింది, మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటున్నామంటూ ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, ఏదైనా మాట్లాడితే ఆధారాలు చూపించే మాట్లాడండి, ఇంకోసారి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని వైసీపీ నాయకులను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరించారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: