nadipinchu na nava song music track / Latest Telugu Christian tracks /
Автор: RAPHAH PRAYER TEMPLE-RPT
Загружено: 2022-06-14
Просмотров: 35147
Описание:
nadipinchu na nava song music track / Latest Telugu Christian tracks / #Raphahprayertemple /#tracks #christiansongs
ఈ చానల్ యొక్క ముఖ్య లక్ష్యం దేవుని పరిచర్యే , దేవుని పరిచర్యలో ఒక భాగమే కానీ మా స్వలాభం కోసం అయితే కాదు . దేవుని దగ్గర ఎవరైతే నిష్కపటంగా సేవ చేసే వారు ఉన్నారో . వారికి ఈ ఛానల్ సపోర్ట్ గ ఉంటుందని దేవుని పేరిట మీకు తెలియజేయడమైనది . నా యేసయ్య నామాన్ని బట్టి మీకందరికీ నా హృదయ పూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను . మీకు ఈ #Videosong నచ్చితే #LIKE , చేయండి , మీ #COMMENTS ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #YOUTUBE ఛానల్ #Subscribe చేసుకోండిచూ
• nadipinchu na nava song music track / Late...
SONG LYRICS
--------------
నడిపించు నా నావా నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు||
నా జీవిత తీరమున నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము ||నడిపించు||
రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము
రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో
రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ ||నడిపించు||
ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి
ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే
ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు ||నడిపించు||
ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని
ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది
ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట ||నడిపించు||
లోటైన జలములలో లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి
లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు
లోపించని అర్పనగా లోకేష చేయుమయా ||నడిపించు||
ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ
పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు ||నడిపించు|
for latest updates please
like
share
suscribe
🙏🙏🙏
praise the lord
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: