Nee Prema Madhuryam | Audio Jukebox | Manna Group of Ministries I Bishop Rachel Jyothi Komanapalli
Автор: MannaTv
Загружено: 2024-04-18
Просмотров: 3166
Описание:
00:00 Nee Prema Madhuryam
06:14 O Prardhana SuPrardhana
12:31 Bhuloka Rajyamulanniyu
19:19 Paramapita Ma Pranadatha
23:28 Siluvanu Gurchinavartha
30:42 Yehova Koraku Eduruchudumu
36:09 Naa Yesu Deva
44:06 Prabuvunu Stuthienchudi
49:35 Yehova Maa Prabuva
=========================================
Song - 1
పల్లవి:
నీ ప్రేమ మాధుర్యము - నేనేమని వర్ణింతును
నా ఊహ చాలదు, ఊపిరి చాలదు ఎంతో ఎంతో మధురం,
నీ ప్రేమ ఎంతో మధురం - ప్రభు యేసు ప్రేమ మధురం
అ.ప:
నా పూర్ణ హృదయముతో - నా పూర్ణ ఆత్మతో
నా పూర్ణ మనస్సుతో - నిన్ను పూజింతు నా ప్రభువా
1. దేవ దూతలు - రేయింబవళ్ళు
కొనియాడుచుందురు - నీ ప్రేమను
కృపామయుడా - కరుణించువాడా
ప్రేమ స్వరూపా - ప్రణుతింతునయ్యా
2. సృష్టికర్తవు - సర్వలోకమును
కాపాడువాడవు - పాలించువాడపు
సర్వమానవులను - పరమును చేర్చెడి
అద్వితీయుడా - ఆరాధ్య దైవమా
Song - 2
పల్లవి:
యెహోవా దొరుకు కాలములందు
ఆయనను వెదకుదము
మహోపకారి సహాయకుడు
ఆయనను వెడెదము ॥2॥
అ.ప: :
ఓ ప్రార్థన సుప్రార్ధన ప్రభువు నేర్పిన ప్రార్థన
ప్రేమతో ప్రతిఫలమిచ్చును క్రీస్తేసునామమున
1. పరలోకమందున్న మన తండ్రి - ప్రతివాని కోరిక తీర్చున్
నిశ్చయముగా ఈవులను అడిగిపొందుము
2. శోధనబాధలలో విసుగక - విజ్ఞాపన చేయుము
విశ్వాసముతో ప్రార్థించుము సాతానును జయించుము
3. ఇద్దరు ముగ్గురు ప్రార్థించినప్పుడు - ప్రభువు దిగివచ్చును
అసాధ్యమైనవి సాధ్యపరచు ఆత్మలో ప్రార్థించుము
Song - 3
పల్లవి:
భూలోక రాజ్యములన్నియు - యెహోవా దేవునివే
భూలోక నివాసులందరు - ఆయన వారసులే
అ.ప:
సమస్త దేశములారా సంతోషగానము చేయుడి
యెహోవాయే దేవుడని ఉత్సాహగానము చేయుడి
మహోన్నతం ప్రభునామము పరిశుద్ధుడని కొనియాడుడి
మహోన్నతుని మహాత్మ్యము సమాజములో కీర్తించుడి
1. సీయోనులో సింహాసనాసీనుడు
నీతి న్యాయములతో పరిపాలించువాడు
అన్యజనులకు రక్షణ శృంగముగా
నిబంధన జనులను నిత్యము నడిపించును
2. సైన్యాధిపతిగా విజయము దయచేయును
శత్రువులను సహామిత్రులు చేయువాడు
భక్తులందరిని అభయ హస్తముతో
ప్రతి ఉదయమున కృపలతో తృప్తిపరచును
3. ఈ లోక రాజ్యములు క్షయమైపోవునవే
దేవుని రాజ్యము శాశ్వత రాజ్యము
తరతరములకు యుగయుగముల వరకు
సర్వాధిపతిగా ప్రభువే పాలించును
Song - 4
పల్లవి:
పరమ పితా మా ప్రాణదాత
పరిశుద్ధుడా పరిపాలకుడా
యెహోవా దేవా నీవే మా తండ్రివి
నీ ఘన నామమును స్తుతింతును, స్తుతింతుము
1. మా ప్రభుయేసు నా రక్షణ కర్త !
రాజుల రాజు ప్రభువుల ప్రభువా |
త్వరలో రానైయున్న మా పెండ్లికుమారుడా!
మా ఆరాధనకు అర్హుడవు నీవు (నీవే)
2. పరిశుద్దాత్ముడా సర్వశక్తిమంతుడా!
ఆశ్చర్యకరుడవు ఆదరణకర్తవు!
సర్వ సత్యమునకు నడిపించువాడా!
సంఘవధువుగా మమ్ము సిద్ధపరచుము
Song - 5
పల్లవి:
సిలువను గూర్చిన వార్త
ప్రభుయేసు సిలువ సువార్త
నశియించుచున్న వారికీ ఎంతో వెర్రితనం
రక్షింపబడిన వారికి అద్భుత దైవశక్తి
అ.ప:
ఓ మానవా, వీక్షింపవా క్రీస్తు సిలువన్
నీ ప్రేమ ప్రేమకు అర్పించుమా నీ హృదయం
1. భూమికి పునాది వేయక మునుపే
దేవుని దయగల సంకల్పముచే
ప్రేమతో క్రీస్తు ఏర్పరచెన్
ప్రియ బిడ్డలుగా అంగీకరించెన్
2. దేవుని కృప మహా ఐశ్వర్యములో
ప్రియ కుమారుని రక్తముతో
పాపక్షమాపణ ప్రకటించెన్
పావనులనుగా తీర్చి దిద్దన్
Song - 6
పల్లవి:
యెహోవా కొరకు ఎదురు చూడుము
నూతన బలము పొందెదవు
అనుదినమాయన వాత్సల్యతను
నూతనముగా చూపును ప్రభువు
అ.ప:
నీవు అలయక పరుగెత్తెదవు
సామ్మసిల్లక నడచిపోదువు
పక్షిరాజువలె రెక్కలు చాపి పైకి ఎగురుదువు
1. పేరు పెట్టి నిన్ను పిలిచెను
ప్రేమించి విమోచించును
భయపడకుము, దిగులుపడకుము
దక్షిణబాహువు ఆదుకొనును
2. తమ దేవునిని ఎరుగువారు
గొప్పకార్యములు చేయుదురు
శూరకార్యములు జరిగించెదరు
సర్వశక్తుని ఆశ్రయించుము
Song - 7
పల్లవి:
నా యేసు దేవా - నన్నేలు రాజా
నీ పాద సన్నిధినినే - నేకోరుచున్నాను
నీ పాద సన్నిధినే - సదా కోరుచున్నాను
ఓ నీతి సూర్యుడా - రవికోటి తేజుడా
నీ ఉదయ కాంతిని ప్రసరింపజేయుమా
నీ ముఖకాంతిలో నను శుద్ధిచేయుమా
నీ సమాధానమును నాకు అనుగ్రహించుమా
1. సీయోనులో సూర్య తేజమా
శుద్ధాత్మతో వెలిగించుమా
అరుణోదయ దర్శనము మాకనుగ్రహించుమా
నీ రక్షణానందమును నాలో పుట్టించుమా
2. ఈ నేత్రములు తెరువుము తండ్రీ
నీ ప్రసన్నత మాకు చూపుము
ఈ జీవిత కాలమంతా నీ మందిరావరణములో
నీ ప్రేమను గ్రోలుచునే వసియింపగోరుదును
3. నీదు జీవవాక్కులే - నా బ్రతుకులో దీపము
నాకు త్రోవచూపును చేయి పట్టి నడుపును
నీ ఆజ్ఞలు పాటించుటకు బుద్ధిని దయచేయుమా
నీ వాక్యము ననుసరించి నే నడుచుకొందును
Song - 8
పల్లవి:
ప్రభువును స్తుతించుడి - ప్రభువుల ప్రభువును స్తుతించుడి
రాజును స్తుతించుడి - రాజుల రాజును స్తుతించుడి
అ.ప:
దేవగొట్టెపిల్ల యేసుక్రీస్తు ప్రభువు
దావీదు చిగురు స్తోత్రార్హుడు ఆయనే
యూదా గోత్రపు సింహము - యోగ్యుడైన వాడు
సర్వాధిపతి ఆరాధనకు పాత్రుడు
1. పరిశుద్ధ దేవుని ఆరాధించుడి
ఆత్మలో సత్యముతో ఆరాధించుడి
2. కోట్లాది దూతలు పాడుదురు
పరిశుద్ధులంతా ప్రస్తుతింతురు
3. సూర్యచంద్రాదులు స్తోత్రించును
సమస్త జీవులు స్తోత్రించును
Song - 9
పల్లవి:
యెహోవా మా ప్రభువా - యేషువా మా రక్షకా
యెహోవాషాలోం - యెహోవా రాఫా
మా ఇమ్మానుయేలు రాజా
అ.ప:
రక్షణ స్తోత్రము - బలము ప్రభావము
శక్తి ఐశ్వర్యం - ప్రభుయేసువే
స్తుతి ఘనమహిమ - ఇహపరములలో
రాజులరాజునకే
1. దేవా నీకృపా బాహుళ్యములో - కరుణ చూపితివి
మా దోష శిక్షను భరించి మమ్మును - ధన్యులజేసితివి
2. ప్రార్ధన నాలించి వాక్కును పంపి - బాగు చేసితివి
సిలువలో పొందిన గాయములతో స్వస్థత నిచ్చితివి
3. ప్రభువా నీ ఉపకారములకు - ఏమి చెల్లింతుము
రక్షణ పాత్రను చేతబూని - ఆరాధించెదము
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: