టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి వ్యాఖ్య |C news C channel
Автор: C News Vijayawada
Загружено: 2025-07-30
Просмотров: 3
Описание: ఖమ్మం, నల్గగొండ జిల్లాలకు చెందిన మంత్రుల బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పని చెయ్యనివ్వడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. 19 నెలల కాంగ్రెస్ పాలనలో రైతు బంధు సహా ఏ సంక్షేమ పథకం సక్రమంగా అమలు కావడం లేదన్నారు. దాంతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని పేర్కొన్నారు. ఎరువుల పంపిణీ అంశంలో చర్చకు సిద్ధమా అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సవాలు విసిరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో తొలిసారి ఖమ్మం వచ్చిన ఆయన స్థానికంగా నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి బదులుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 42 శాతం బీసీ రిజర్వేషన్ బీసీలకు కాదని ముస్లిం రిజర్వేషన్ అని ఆరోపించారు. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదన్న ఆయన.. ముస్లింలకు 10 శాతం ఈబీసీ రిజర్వేషన్, 4 శాతం రిజర్వేషన్ అమలులో ఉందని తెలిపారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని, ఆర్డినెన్సు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంపై బురద చల్లుతూ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: