Human bomb threat: Kuwait-Hyderabad IndiGo flight diverted to Mumbai
Автор: Gulf expert Telugu
Загружено: 2025-12-02
Просмотров: 16
Описание:
మానవ బాంబ్ భయం: కువైట్ - హైదరాబాద్ ఇండిగో విమానం ముంబైకి మళ్లింపు
ముంబై/హైదరాబాద్: కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో 'హ్యూమన్ బాంబ్' (మానవ బాంబు) ఉందంటూ బెదిరింపులు రావడం కలకలం రేపింది. మంగళవారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో బాంబు ఉందంటూ అధికారులకు సమాచారం అందడంతో, అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని అత్యవసరంగా ముంబైకి దారి మళ్లించినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
మీడియా కథనాల ప్రకారం.. విమానంలో హ్యూమన్ బాంబ్ ఉందంటూ తొలుత హైదరాబాద్ విమానాశ్రయానికి హెచ్చరిక సందేశం వచ్చింది. ఢిల్లీ విమానాశ్రయానికి కూడా ఇదే తరహాలో వివరాలతో కూడిన సందేశం రావడంతో భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమై అత్యవసర భద్రతా చర్యలు చేపట్టాయి.
అనంతరం విమానం ముంబైలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. వెంటనే విమానాన్ని తనిఖీల నిమిత్తం విమానాశ్రయంలోని 'ఐసోలేషన్ బే' (సురక్షిత ప్రాంతం)కు తరలించారు. అధికారులు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తుండగా, భద్రతా బృందాలు మరియు ఎమర్జెన్సీ రెస్పాండర్లు అక్కడ సిద్ధంగా ఉన్నారు. అయితే, విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటనపై ఇండిగో సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: