భారతదేశమా యేసుకే || Bharathadesama Yesuke || Telugu Christian Song ||
Автор: PFH OFFICIAL
Загружено: 2025-08-14
Просмотров: 3664
Описание:
భారతదేశమా యేసుకే
నా భారత దేశమా ప్రియ యేసుకే (2)
నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్ధన
నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం (2)
యేసు నామమే జయము జయమని ఇహమంత మారుమ్రోగాలి
పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలై పోవాలి (2)
భారత దేశమా నా భారతదేశమా
నా ప్రియ యేసుకే నీవు సొంతం కావాలి
భారతదేశమా నా భారతదేశమా
ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి
1. సృష్టికర్తనే మరచి భారతదేశమా
సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా (2)
ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా
నిను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా (2)
భారతదేశమా యేసుని చేరుమా
నూతన సృష్టిగా మార్ఛబడుటకు భారతదేశమా (2)
2. శాంతికి అధిపతి ఆయనే భారతదేశమా
శాంతి రాజ్యముగ స్ధాపించును నా భారతదేశమా (2)
లోకమంతయు లయమైపోవును భారతదేశమా
లోకాశలన్నియు గతించిపోవును భారతదేశమా (2)
3. రాజుల రాజుల మన యేసే భారతదేశమా
పెండ్లి కుమారుడై రానుండే నా భారతదేశమా (2)
యేసుని నమ్మిన దేశములన్నియు భారతదేశమా
తనతోకూడా కొనిపోబడును భారతదేశమా (2)
భారతదేశమా యేసుని చేరుమా
సువర్ణ దేశముగా మార్ఛబడుదువు భారతదేశమా (2)
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: