ఏడు కొండల వేంకటేశ్వరా స్వామి నీవయ్యా మమ్మేల రావయ్యా//, తెలుగు భజన పాటలు //, devotional songs
Автор: vvreddy
Загружено: 2023-10-27
Просмотров: 178730
Описание:
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
=====
మా అన్నయ్య సినిమాలో నీలి నింగిలో నిండు జాబిలి పాట స్టైల్
ఏడు కొండల వేంకటేశ్వరా స్వామి నీవయ్యా మమ్మేల రావయ్యా
మొరనాలకించలేవా దరిచేర రావ దేవా
శ్రీనివాసుడవే శ్రితపారిజాతహరే
తిరుమల తిరుపతి కొండలలో శిలగ వెలసి వున్నావు
కోరిన వరములు మాకిచ్చే దేవ దేవుడవైనావు
సిరిగల దైవము నీవయ్యా సుందర రూపం నీదయ్యా
చేరుకోవాలి నిను వేడుకోవాలి
ఆపదమొక్కుల వాడవని ముడుపులెన్నో కట్టాము
నీ పద సన్నిధి చేరాము నీదు మొక్కులు తీర్చాము
కోపము బూనకు మా పైనా కావగరావ శ్రీ రమణా
చూపుమా జాలి మా స్వామి వనమాలి
ఏ పేరున నిను పిలవాలి ఎంతగా నిను పొగడాలి
ఏ రూపముగా కొలవాలి ఎన్ని పూజలు చేయాలి
ఏడుంటివయా శీలోలా కానగరావ కరిపాల
ఏమి నీ మహిమా నిను పొగడగ మా తరమా
నారద తుంబుర గానమున ఓలలాడిన శ్రీహరివే
త్యాగయ అన్నమయ్య కృతులకును మురిసిన మా శ్రీపతివే
అప్పన్నదాసుని కీర్తనలే వినగా రావా ఓ దేవా
దీనులను కావా వేవేగ రాలేవా
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: