రూ.15 కోట్లతో ఆగిరిపల్లి ఆలయ అభివృద్ధి..టెంపుల్ టూరిజంపై ప్రభుత్వ దృష్టి | Prime9 West Godavari
Автор: Prime9 West Godavari
Загружено: 2026-01-25
Просмотров: 15
Описание:
#prime9westgodavari #rathasaptami #aagiripalli #lakshminarasimhaswamy #templefestival #andhrapradeshnews #templetourism #devotees #telugunews #hindufestivals
రథసప్తమి సందర్భంగా నూజివీడు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ఆగిరిపల్లిలో శ్రీ శ్రీ శ్రీ సోమనాచల వ్యాగ్ర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారికి పట్టు వస్త్రాలను రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి సమర్పించారు.ఆగిరిపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ శ్రీ శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.మంత్రి కొలుసు పార్థసారధి హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మంత్రి ఆకాంక్షించారు.ఆలయాన్ని రానున్న మూడు సంవత్సరాల్లో సుమారు 15 కోట్లతో అభివృద్ధి చేస్తామని,టెంపుల్ టూరిజం పరంగా సకల సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు. చుట్టబక్కల గ్రామాల నుండే కాకుండా వివిధ జిల్లాల నుండి నేడు భారీగా భక్తులు ఆగిరిపల్లి చేరుకొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఏదైనా కోరిక కోరుకుంటే శ్రీ శ్రీ శ్రీ శోభనాచల వ్యాగ్ర లక్ష్మీనరసింహస్వామి తప్పకుండా తీరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం.ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,గ్రామ పెద్దలు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
| Subscribe |
| Prime9 West Godavari |
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: