జానపదశాస్త్రనిర్వచనాలు సిద్ధాంత చర్చ A theoretical discussion on Definitions of Folklore
Автор: PuliKannu on Telugu Literature SubbacharyPulikonda
Загружено: 2024-08-20
Просмотров: 466
Описание:
మిత్రులారా ఇన్నాళ్ళూ ఎదురు చూచిన పుస్తకం ప్రతులు వచ్చేశాయి.
120/-రూ. ఖరీదైన ఈ పుస్తకాన్ని నా వద్దనుండి తెప్పించుకుంటే రూ.100/-కే మీ ఇంటికి పంపిస్తాను. నాకు జి.పే కానీ ఫోన్ పే కానీ 9440493604కి పంపించండి మీ చిరునామా నా వాట్సప్‌కి పెట్టండి. రచయిత దగ్గరనుండి పుస్తకాలు నేరుగా కొనే ఈ సంప్రదాయాన్ని ప్రోత్సహించండి. ఎన్నో సంవత్సరాల పరిశోధనే కాదు ఎంతో వ్యయం చేసి పరిశోధకులు రచయితలు పుస్తకాలు అచ్చు వేస్తున్నారు. పాఠకులు ప్రోత్సహిస్తే మరింత మంచి పరిశోధనలు వస్తాయి. ఈ పుస్తకానికి సంబంధించిన సమాచారం కింద ఉంది చదవండి. ఇది విద్యార్థులకు, పరిశోధకులకు, సాహిత్యాభిమానలు అందరికీ ఉపయుక్తం.
ఈ చిన్న పుస్తకంలో ఫోక్‌లోర్ పదం పుట్టిన 1846 నుంచి నుంచి అంతర్జాతీయంగా ఉన్న నిర్వచనాలు అన్నింటిని పరిశీలించి తెలుగులో వచ్చిన నిర్వచనాలు అన్నింటినీ పరిశీలించి అవి సిద్ధాంత పరంగా ఎన్ని వైరుధ్యాలతో ఉన్నాయో విశ్లేషించాను.
1965లో వచ్చిన ప్రపంచప్రసిద్ధ జానపదవిజ్ఞాని అలన్ డండెస్ చేసిన నిర్వచనం ప్రపంచ వ్యాప్తంగా వినియోగంలో ఉన్నది. కాని తర్వాత 1980 దశకంలో అదే స్థాయి అమెరికన్ జానపదవిజ్ఞాని డాన్ అమోస్ చేసిన నిర్వచనం, డండెస్ నిర్వచనంలోని సమస్యలను తొలగించింది. 1949లో వచ్చిన స్టాండర్డ్ డిక్షనరీ ఆఫ్ ఫోక్‌లోర్ మిథాలజీ అండ్ లెజెండ్ లో సేకరించిన 21 ప్రసిద్ధనిర్వచనాలను ఇందులో తెలుగులోకి అనువదించి ఈ అన్ని నిర్వచనాలపైన ఒక సిద్ధాంతచర్చ చేసి తెలుగులో జానపదవిజ్ఞానులకు ఏది బాగా అనుసరణీయం అని ఈ గ్రంథంలో వివరించాను. ఇది జానపదపరిశోధకులకే కాక మౌఖికలిఖితసాహిత్య తులనాత్మక అధ్యయనం చేసే వారికి సాహిత్య పరిశోధకులు అందరికీ ఉపయుక్తం.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: