KTR TOUR KHAMMAM
Автор: BCTV TELUGU
Загружено: 2026-01-07
Просмотров: 118
Описание:
ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ నూతన సర్పంచులు, ఉప సర్పంచుల అభినందన సభలో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎండగట్టారు.
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో యూరియా కష్టాలు లేవు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే లైన్‌లలో చెప్పులు కనిపిస్తున్నాయి. షాపుల్లో లేని యూరియా యాప్‌లలో ఎలా వస్తుంది?
కాంగ్రెస్ పాలనలో ఎగవేతలు, కూల్చివేతలు. కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు ఇచ్చారా? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చారా? రెండేళ్లలో ఏం అభివృద్ధి జరిగింది? కూల్చివేతలు, ఎగవేతలే కనిపిస్తున్నాయి. ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం.
ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ పని చేశారు. ఇప్పుడు ఇదే జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. కనీసం రైతులకు యూరియా ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నారు. కమీషన్ల కోసమే ఆ ముగ్గురు పని చేసేది. 30 శాతం ట్యాక్స్ నడిపిస్తున్నారు వాళ్లు. ఆరు గ్యారెంటీలు భద్రంగా పెట్టుకోండని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆనాడు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఇప్పుడు రెండేళ్లు అయినా గ్యారెంటీలు అమలు కాలేదు. దీనికి భట్టి ఏమి సమాధానం చెబుతారు? అని కేటీఆర్ గారు అన్నారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: