ప్రధానమంత్రి సభలో దద్దరిల్లిన పయ్యావుల ప్రసంగం! |
Автор: Payyavula Keshav
Загружено: 2025-10-16
Просмотров: 4
Описание:
Watch here : ప్రధానమంత్రి సభలో దద్దరిల్లిన పయ్యావుల ప్రసంగం!
కర్నూల్‌లో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” బహిరంగ సభ ఎంతో ఉత్సాహంగా జరిగింది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభ ప్రారంభంలో రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు చేసిన స్వాగత ప్రసంగంతో బహిరంగ సభ దద్దరిలింది.
స్వాగత ప్రసంగంలో మంత్రివర్యులు మాట్లాడుతూ, 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్‌డిఏ కూటమికి వేసిన ఓటు రాష్ట్ర భవిష్యత్తును మార్చిందని పేర్కొన్నారు. ఆ ఓటుతో రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు, వేల కోట్ల విలువైన సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. ప్రజలు వేసిన ఓటు ద్వారా పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని అభివృద్ధి, విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్ర నిధులు సాధ్యమయ్యాయని వివరించారు.
ఇంకా, కేవలం ఒక్క ఓటుతోనే రాష్ట్రంలో 16,000 మందికి DSC ఉద్యోగాలు లభించాయని అన్నారు. జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రతి కుటుంబానికి సంవత్సరానికి సగటున రూ. 20,000 వరకు ఆదా అవుతోందని చెప్పారు. సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ పై ఐ.టి. మంత్రి నారా లోకేష్ గారి సారధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 98 వేల అవగాహనా కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. ప్రధాని మోదీ గారి నాయకత్వంలో ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ తన శక్తిని ప్రపంచానికి చూపించిందని చెప్పారు.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గార్ల నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం ప్రజల కోసం నిరంతరం పని చేస్తుందని, ఇలాగే ఈ ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని పయ్యావుల కేశవ్ గారు అభిప్రాయపడ్డారు.
#IdhiManchiPrabhutvam #SuperGSTSuperSavings #NarendraModi #ChandrababuNaidu #PayyavulaKeshav #AndhraPradesh
For more updates " SUBSCRIBE " our channel👇👇
/ @payyavulakeshavoffl
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: