Super Prime Time : మహారాష్ట్ర పొలిటికల్ చాణక్యుడి ఫుల్ జర్నీ - TV9
Автор: TV9 Telugu Live
Загружено: 2026-01-28
Просмотров: 3009
Описание:
1959 జూలై 22న మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని దేవ్‌లాలి ప్రవరాలో జన్మించిన అజిత్ పవార్.. 23 ఏళ్ల వయసులోనే రాజకీయ రంగప్రవేశం చేశారు. చక్కెర సహకార బోర్డు సభ్యుడిగా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన అజిత్.. ఆనాడే తన రాజకీయ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకున్నారు. 1991లో పుణె జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి.. సహకార రంగంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఆ పదవిలో ఏకంగా 16 ఏళ్లపాటు కొనసాగారు. అజిత్ పవార్ తొలిసారిగా 1991లో బారామతి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. శరద్ పవార్ కోసం దాన్ని త్యాగం చేశారు. దీంతో అదే స్థానం నుంచి గెలుపొందిన శరద్ పవార్.. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేసేందుకు దోహదం చేసింది. ఢిల్లీ పీఠంపై బాబాయ్ ఉంటే.. గల్లీ నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు తానై నడిపించారు అజిత్. 1991లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన.. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటివరకు ఏకంగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి.. మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో రికార్డు సృష్టించారు.
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#superprimetime #baramati #ajitpawar #bjp #maharashtra #tv9telugu
Credits : #kpchandrarao
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: