Collector Orders Winter Safety Measures for Welfare Hostel Students........
Автор: Telangana Info Hub
Загружено: 2025-11-18
Просмотров: 34
Описание:
ప్రచురణార్థం
మెదక్, 18 నవంబర్ 2025
అన్ని సంక్షేమ వసతిగృహాల విద్యార్థినీ విద్యార్థుల శీతాకాలం చలి నుండి రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంక్షేమ అధికారులను ఆదేశించారు
మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో అన్ని సంక్షేమ శాఖాధికారులతో జిల్లాలో ఉన్న సంక్షేమ హాస్టల్లో విద్యార్థిని విద్యార్థుల శీతాకాలం చలి నుండి రక్షణగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
శీతాకాలం చలి తీవ్రంగా ఉందని, ఇప్పటికే అన్ని సంక్షేమ వసతి గృహాలకు గురుకులాలకు, బెడ్ షీట్స్, కార్పెట్స్, సరఫరా చేయడం జరిగిందని, ఉన్న సౌకర్యాలతో విద్యార్థులకు చలి నుండి రక్షణగా
చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలలో బ్లాంకెట్స్ , అవసరమగు ప్రతిపాదనలు అందజేయాలని సంక్షేమ అధికారులను ఆదేశించారు.
విద్యార్థుల నాణ్యమైన మెనూ తయారు చేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు, విద్యార్థుల నాణ్యమైన గుణాత్మక విద్య అందించే విధంగా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, ఇంచార్జి జిల్లా విద్యాశాఖ అధికారి , సంబంధిత గురుకుల ప్రిన్సిపల్, తదితరులు పాల్గొన్నారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: