అందాల తార అరుదెంచె నాకై - Andala Thara Arudenche Naakai | Latest Telugu Christmas Song 2025
Автор: Gospel Beats Telugu
Загружено: 2025-12-19
Просмотров: 1681
Описание:
క్రిస్మస్ శుభాకాంక్షలు మిత్రులారా! 🎁
ఎంతో ఆత్మీయమైన మరియు సాంప్రదాయమైన క్రిస్మస్ గీతం "అందాల తార అరుదెంచె నాకై" మీ కోసం. ఆకాశ వీధిలో తార వెలిసి, రక్షకుని జాడ తెలిపిన అద్భుతమైన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, ఈ పాటను ఆస్వాదించండి.
ఈ పాట మీ హృదయాల్లో క్రీస్తు ప్రేమను, ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నాం.
📜 సాహిత్యం (Lyrics)
పల్లవి:
అందాల తార అరుదెంచె నాకై.. అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి.. అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పొంగె నాలో.. అమరకాంతిలో
ఆది దేవుని జూడ.. ఆశింప మనసు పయనమైతిని ||అందాల తార||
చరణం 1:
విశ్వాసయాత్ర దూరమెంతైన.. విందుగా దోచెను
వింతైన శాంతి వర్షించె నాలో.. విజయపథమున
విశ్వాలనేలెడి దేవకుమారుని.. వీక్షించు దీక్షతో
విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ.. విశ్రాంతి నొసగుచున్ ||అందాల తార||
చరణం 2:
యెరూషలేము రాజనగరిలో.. యేసును వెదకుచు
ఎరిగిన దారి తొలగిన వేళ.. ఎదలో కృంగితి
యేసయ్యతార ఎప్పటివోలె.. ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు.. ఏగితి స్వామి కడకు ||అందాల తార||
చరణం 3:
ప్రభుజన్మస్ధలము పాకయేగాని.. పరలోక సౌధమే
బాలునిజూడ జీవితమెంత.. పావనమాయెను
ప్రభుపాదపూజ దీవెనకాగా.. ప్రసరించె పుణ్యము
బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె.. ఫలియించె ప్రార్ధన ||అందాల తార||
🌟 Credits
Song: Andala Thara Arudenche Naakai
Category: Telugu Christmas Songs
Re Imagination Presented by: Gospel Beats Telugu
#andhalatharaarudenchenaakaisong #jesustelugusongs #chrisitiantelugusongs #teluguchristiansongs #telugujesussongs #telugulyricaljesussongs #christianlyricssongs #gospelsongs
#teluguchristiansongs #christmas2025 #christmas2024 #christmassong #christmasspecial #newchristmassong2025 #jesussongs #telugudevotionalsongs #teluguchristmassong
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: