ఆదర్శ కమ్యూనిస్టు జ్యోతిబసు 16వ వర్ధంతి
Автор: Seema News
Загружено: 2026-01-17
Просмотров: 33
Описание:
సమ సమాజ స్థాపన సోషలిస్టు సమాజం కోసం జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శ కమ్యూనిస్టు జ్యోతిబస్ అడుగుజాడల్లో పయనిద్దామన్న CPM
ఆదర్శ కమ్యూనిస్టు జ్యోతిబసు 16వ వర్ధంతి కార్యక్రమాన్ని కేకే భవన్ లో సిపిఎం పార్టీ నగర కార్యదర్శివర్గ సభ్యులు సాయిబాబా అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండి ఆనంద్ బాబు, టి రాముడు, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఆర్ నరసింహులు మాట్లాడారు. ముందుగా ఆదర్శ కమ్యూనిస్టు జ్యోతిబసు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ జ్యోతిబసు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 23 సంవత్సరాలు ఏకధాటిగా ఐదు పర్యాయాలు ముఖ్యమంత్రిగా తిరుగులేని కమ్యూనిస్టు యోధుడిగా అశేష ప్రజానీకం కార్మిక వర్గం ఆశాజ్యోతి గా మన్ననలు పొందిన గొప్ప నాయకుడన్నారు. బెంగాల్ రాష్ట్రంలోకమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పేదవాడికి భూమి ఇవ్వాలనే నినాదంతో లక్షలాది ఎకరాలను భారతదేశంలో ఏ రాష్ట్రము కూడా ఇవ్వనన్ని భూములను పేదలకు పంచి ఆదర్శ కమ్యూనిస్టు గవర్నమెంట్ గా నిలిచిందన్నారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు గురుశేఖర్, దేవ సహాయం, పిఎన్ఎమ్ జిల్లా కార్యదర్శి రాజు, సిఐటియు నగర అధ్యక్షులు వై నగేష్, సిపిఎం నగర నాయకులు కే సుధాకరప్ప, కెవిపిఎస్ నగర అధ్యక్ష కార్యదర్శులు ఎం భాస్కర్ జి. ఏసు, రోషి, నగర నాయకులు జయమ్మ విజయమ్మ బంగి పద్మ సోషల్ మీడియా జిల్లా నాయకులు ఎల్ల గురువే యోగేంద్ర బతుకన్న, శంకర్ చెన్నయ్య కెవిపిఎస్ సిఐటియు నాయకులు మొదలగు వారు పాల్గొన్నారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: