ఎన్నికల సంఘం నియమాలను ఉల్లంఘించి మరీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల తో బలవంతపు బిఎల్ఓ విధులు
Автор: ens live
Загружено: 2025-12-17
Просмотров: 2937
Описание:
https://ceojk.nic.in/pdf/BLO%20Handbo...
1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 13బి (2) కింద బిఎల్వో విధులకు కేవలం 13శాఖల సిబ్బందిని మాత్రమే వినియోగించాలని భారత ఎన్నికల సంఘం హేండ్ బుక్ లో ప్రత్యకంగా పేర్కొంది..// అందులో 1)ఉపాధ్యాయులు 2)అంగన్వాడీ వర్కర్లు, 3)కోర్టు అమిన్ లు, పట్వారీలు, లేఖ్ పాల్ లు, 4)పంచాయతీ కార్యదర్శిలు, 5)గ్రామ స్థాయి పనివారు, 6)విద్యుత్ బిల్లులు తీసే సిబ్బంది, 7)పోస్టుమాన్, 8)ఏఎన్ఎంలు, 9) ఆరోగ్య సహాయకులు 10)మధ్యాహ్నా భోజన పథకం సిబ్బంది 11) ఒప్పంద ఉపాధ్యాయులు 12) కార్పోరేషన్ టాక్స్ కలెక్టర్స్, 13) నగర పరిధిలోని క్లరికల్ స్టాఫ్, (యుడీసీ, ఎల్డీసీ)లను మాత్రమే బిఎల్వో విధులకు వినియోగించాలని ప్రత్యేకంగా పొందు పరిచారు..// అంతేకాకుండా బిఎల్వో విధులు చేసినందుకు గాను ఏడాదికి రూ.3వేలు గౌరవ వేతం.. అదనంగా బిఎల్వోలో వేరే పార్టులో పనిచేస్తే దానికి మరో రూ.750 ఎన్నికల సంఘం చెల్లించాల్సి వుంది..// బిఎల్వో విధుల్లో ఫోటోలు తీసి అప్లోడ్ చేసే సమయంలో ఒక్కో ఫోటోకి నాలుగు రూపాయలు.. 90శాతం దానిటితే ఒక్కో ఫోటోకి 5రూపాయలు చెల్లించాలి..// అన్నింటి కంటే ముఖ్యంగా పెన్సిల్, పెన్ను, వైట్ పేపర్స్, మొత్తం సరంజామా మొత్తం రాష్ట్రప్రభుత్వమే సరఫరాల చేయాల్సి వుంది..// కానీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో బిల్వో రాజ్యాంగ విరుద్ధంగా.. 1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 13బి (2) కి వ్యతిరేకంగా బిఎల్వో విధులు చేయిస్తున్నది రాష్ట్రప్రభుత్వం..// ఇదే సమయంలో సమయానికి అనుకున్న టార్గెట్లు పూర్తి కాకపోతే సిబ్బందిని తిట్టడం, పరిష్మెంట్లు ఇవ్వడం, షోకాజ్ నోటీసులు ఇవ్వడం చేస్తున్నారు..// తాము ఎన్నికల సంఘం పేర్కొన్న విధుల్లోకి రామని ఎంత చెప్పినా వినకుండా జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహశీల్దార్లు, డీఎల్డీడీలు బలవంతంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బలవంతంగా బిఎల్వో విధులు చేయిస్తున్నారు..// ఇక్కడ ఎవరైనా ఎన్నికల సంఘం నియమావళిపై ప్రశ్నిస్తే వారిని పనిగట్టుకొని వేధించి.. ఉద్యోగులే స్వయంగా ఆత్మహత్యలు చేసుకునే విధంగా అధికారులు వేధిస్తున్నారు..// ఈ క్రమంలో 2019 నుంచి 2025 వరకూ వందల సంఖ్యలోని సచివాలయ ఉద్యోగులు అధికారులు పెట్టే వేధింపులు, అదనపు పనిభారం తట్టుకోలే ఆత్మహత్యలకు పాల్పడ్డారు...// దీనిపై భారత సర్వోన్నత న్యాయస్థానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది..// అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్లు, జోనల్ కమిషనర్ల తీరులో ఎలాంటి మార్పు రాకపోవడం విశేషం..//
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: