Cases Against Chandrababu Naidu Quashed | చంద్రబాబు పై ఉన్న కేసులు కొట్టివేత | Telugutimes
Автор: Telugu Times Live
Загружено: 2026-01-14
Просмотров: 70
Описание:
Cases Against Chandrababu Naidu Quashed | చంద్రబాబు పై ఉన్న కేసులు కొట్టివేత | Telugutimes
ముఖ్యమంత్రి చంద్రబాబుకు బిగ్ రిలీఫ్. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు పైన నమోదైన స్కిల్ కేసును ఏసీబీ కోర్టు మూసివేసింది. ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి 53 రోజులు జైలులో ఉన్నారు. కేసులో ఆరోపణలు వాస్తవం కాదంటూ (మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్) సీఐడీ ఇచ్చిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది. చంద్రబాబు సహా 37 మందిపై విచారణను మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు సహా 37 మంది పైన స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో నిధుల దుర్వినియోగం ఆరోపణలతో కేసు నమోదు చేసారు. ఈ కేసును తాజాగా ఏసీబీ కోర్టు మూసివేసింది. సీఐడీ ఇచ్చిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది. చంద్రబాబు సహా 37 మందిపై విచారణను మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది. ఇదే సమయంలో ఈ కేసులో తీర్పు వెలువరించే ముందు తన వాదనలు వినాలని అజయ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
2014-19 నడుమ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. ఇందుకోసం సీమెన్స్ కంపెనీతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. రూ.3,356 కోట్ల విలువైన ప్రాజెక్టులో సీమెన్స్ వాటా 90 శాతం, మిగతా పది శాతం ప్రభుత్వ వాటాగా పేర్కొన్నారు. 2019లో వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ కార్పొరేషన్ నిధులు దుర్వినియోగమయ్యాయని కేసు (క్రైం నంబరు 29/2021) నమోదు చేసింది.
కాగా, సీమెన్స్ 90 శాతం నిధులను ఈ ప్రాజెక్టులో వాటాగా పెడుతుందని పేర్కొన్నప్పటికీ అలా జరగలేదని.. మొత్తం ప్రభుత్వ నిధులనే వాటాగా చూపించారని తెలిపింది. సీమెన్స్ రాష్ట్రంలో ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించకున్నా, దాని నుంచి నిధులు రాకపోయినా టీడీపీ ప్రభుత్వం ఆ సంస్థకు రూ.371 కోట్లు విడుదల చేసిందని, ఆ డబ్బులను చంద్రబాబు డొల్ల కంపెనీలకు మళ్లించారని సీఐడీ ఆరోపించింది.
ఈ అభియోగాలతో చంద్రబాబుతో సహా 37 మందిపై కేసు నమోదు చేసింది. చంద్రబాబును 37వ నిందితుడిగా చేర్చారు. చంద్రబాబు ప్రజాగళం యాత్రలో ఆయన నంద్యాలలో ఉన్నప్పుడు 2023 సెప్టెంబరు 9న సీఐడీ అధికారులు అరెస్టు చేసి విజయవాడ తీసుకొచ్చారు. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన 53 రోజులపాటు.. 2023 అక్టోబరు 31 వరకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉండాల్సి వచ్చింది
హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తయిందని సీఐడీ అధికారులు ఇటీవల ఏసీబీ కోర్టుకు నివేదిక సమర్పించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు చంద్రబాబుతోపాటు మొత్తం 37 మందికి విముక్తి కల్పించింది. అయితే ఈ కేసులో తీర్పును వెలువరించే ముందు తన వాదనలను వినాలని అజయ్‌రెడ్డి అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తానూ ఫిర్యాదుదారునేనని పేర్కొన్నారు. దీనిపై కోర్టు సోమవారం విచారణ జరిపింది.
ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు, సీఐడీ తరఫున న్యాయవాదులు ఉన్నం అఖిల్ చౌదరి, కొమర చక్రపాణి.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వినోద్ దేశ్‌పాండే వాదనలు వినిపించారు. అన్ని పక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు అజయ్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ అరెస్ట్ తరువాత నాడు రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జైలులో చంద్రబాబు పరామర్శకు వెళ్లిన పవన్ కల్యాణ్ అక్కడే పొత్తు ప్రకటించారు. ఆ తరువాత బీజేపీ జత చేరింది. ఫలితంగా కూటమి 2024 ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించింది. ఇక.. ఇప్పుడు కోర్టు ఈ కేసు మూసివేయటం కీలకంగా మారుతోంది.
#ChandrababuNaidu
#CBN
#CasesQuashed
#CourtVerdict
#LegalRelief
#AndhraPradeshPolitics
#APPolitics
#TDP
#TDPLive
#PoliticalNews
#IndianPolitics
#BreakingNews
#TeluguNews
Telugu Times మీకు అందిస్తుంది —
✔ తాజా రాజకీయ పరిణామాలు
✔ లైవ్ అప్‌డేట్స్ & గ్రౌండ్ రిపోర్ట్స్
✔ బ్రేకింగ్ న్యూస్
✔ ప్రజా సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలు
✔ స్పోర్ట్స్, ఎంటర్టైన్‌మెంట్, బిజినెస్ & మరిన్ని
▶ LIVE & Latest Updates
📺 Telugu Times LIVE: / @telugutimeslive
📢 ఛానల్ సబ్‌స్క్రైబ్ అవ్వండి
👉 Subscribe for Faster News:
/ @telugutimeslive
📱 Follow Telugu Times on Social Media
Instagram: https://www.instagram.com/telugu.time...
Facebook: facebook.com/share/1JY5effNdj/?mibextid=wwXIfr
📰 Telugu Times – Your Trusted Source for Real, Fast & Focused News
24/7 బ్రేకింగ్ న్యూస్, డీప్ అనలసిస్, లైవ్ అప్‌డేట్స్—all in one place.
#TeluguTimes #TeluguTimesLive #TeluguNews #LatestNews #TodayTeluguNews #ViralNews #TrendingNow #NewsUpdates #LatestTeluguNews #BreakingNews #TeluguTrending #PoliticalNews #Headlines #TodayHeadlines #TopNews #PrimeNews #SpeedNews #TelanganaNews #Telangana #AndhraPradesh #AndhraPradeshNews #AndhraNews #Andhra #Rayalaseema #RayalaseemaNews #Seemandhra
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: