జగదభిరామా రఘుకుల సోమా శరణము నీయవయా రామా. Jagadabhi rama raghukula soma. లిరిక్స్ ఉన్నవి.
Автор: Ckreddy Devotional
Загружено: 2025-08-05
Просмотров: 2619
Описание:
జగదభిరామా రఘుకుల సోమా
తోడిరాగం. ఆదితాళం
గానం. బొందలకుంట రామచంద్రారెడ్డి
కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా
పల్లవి
జగదభి రామ రఘుకుల సోమా
శరణము నీయవయా రామా
కరుణను చూపుమయా
"జగదభి రామా"
చరణం 1
కొశిక యాగము కాచితివయ్యా
రాతిని నాతిగ చేసితివయ్యా
హరు విల్లు విరచి మురిపించు సీతను
పరిణయ మాడిన కళ్యాణ రామా
శరణము నీయవయా రామా
కరుణను చూపుమయా
"జగదభి రామా"
చరణం 2
ఒకటే మాట ఒకటే బాణము
ఒకటే సతియని చాటితివయ్యా
కుజనుల ననచి సుజనుల బ్రోచిన
ఆదర్శ మూర్తివి నీవేనయ్యా
శరణము నీయవయా రామా
కరుణను చూపవయా
"జగదభి రామా"
చరణం 3
కానలకేగి కాంతనుబాసి
ఎంతో వేదన చెందితివయ్యా.
అంతేలేని చింతలు ఎన్నో
ఎంతగ ఓర్చావు రామయ్యా
శరణము నీయవయా రామా
కరుణను చూపవయా
"జగదభి రామా"
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: