Telangana Dy CM & Ministers visits JanaSena HQ Helipad for Private Event, Welcomed by JSP Leaders
Автор: JanaSena Party
Загружено: 2025-08-10
Просмотров: 23527
Описание:
జనసేన కేంద్ర కార్యాలయంలోని హెలీప్యాడ్ కి తెలంగాణ మంత్రులు
• ప్రయివేటు కార్యక్రమం నిమిత్తం మంగళగిరి విచ్చేసిన ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మంత్రులు
• శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, పార్టీ నాయకులు
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారితోపాటు ఆ రాష్ట్ర మంత్రులు ఓ ప్రయివేటు కార్యక్రమానికి హాజరయ్యే నిమిత్తం హెలికాప్టర్ లో ఆదివారం ఉదయం మంగళగిరి విచ్చేశారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోని హెలీప్యాడ్ లో దిగారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున వారికి శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, పార్టీ నాయకులు స్వాగతం పలికారు. వీరంతా మంగళగిరిలో జరిగిన ఓ ప్రయివేటు కార్యక్రమానికి హాజరైన అనంతరం తిరుగు ప్రయాణం అయ్యారు. పార్టీ కార్యాలయంలో ప్రాంగణానికి విచ్చేసిన తెలంగాణ మంత్రులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంపిన కొండపల్లి బొమ్మలతో కూడిన జ్ఞాపికలు బహూకరించి వీడ్కోలు పలికారు. శ్రీ భట్టి విక్రమార్క గారితోపాటు మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, శ్రీ వాకిటి శ్రీహరి గారు, తిరుగు ప్రయాణంలో శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు.
రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు శ్రీ అమ్మిశెట్టి వాసు, శ్రీ మండలి రాజేష్ తదితరులు తెలంగాణ మంత్రుల స్వాగత, వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు
Follow JanaSena Chief & Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan :
/ pawankalyan
/ pawankalyan
https://www.x.com/PawanKalyan
Janasena Party is an Indian political party active in the states of Andhra Pradesh and Telangana. Founded by Pawan Kalyan on 14 March 2014, it is currently the second largest party in the Andhra Pradesh Legislative Assembly and a partner in the ruling coalition.Pawan Kalyan, the party leader, has been serving as the Deputy Chief Minister of Andhra Pradesh since June 2024. Janasena advocates for a centrist approach with a focus on humanism.The party's election symbol is a glass tumbler.
Other official Social media Links :
/ janasenaparty
/ janasenaparty
/ janasenaparty
#JanaSenaParty #PawanKalyan #DeputyCM
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: