తుడుందెబ్బ బ్యానర్ పై పోటీచేస్తా - సోయం బాపురావు : Adivasi Kabur
Автор: Adivasi Kabur
Загружено: 2018-04-21
Просмотров: 46261
Описание:
ఆదివాసీ ఉద్యమాన్ని తాను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చుతున్నాని కొందరు తెరాస ఆదివాసీ నాయకులు, ఇతరులు చేస్తున్న విమర్శలను మాజీ ఎమ్మెల్యే , తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు తీవ్రంగా ఖండించారు . తనకు పార్టీ కన్న తన జాతి ప్రయోజనాలు ముఖ్యమని స్పష్టం చేసారు . శుక్రవారం జరిగిన, 37 వ ఇంద్రవెల్లి అమరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా అమరులకు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం జరిగిన సమావేశంలో తను మాట్లాడాడు.
ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కండువాను ధరించి ఆదివాసీ ఉద్యమం లో పాల్గొనలేదని, ఉద్యమానికి ప్రతీకైనా తుడుందెబ్బ కండువానే ధరిస్తున్నాని సోయం బాపురావు చెప్పారు. ఆదివాసీ ఉద్యమ నాయకునిగా తాను తన జాతి హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాన్నని తనకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వక పోయిన నష్టం ఏమిలేదని, అవసరమైతే ఆదివాసీ ఉద్యమ సంస్థ తుడుందెబ్బ ( ఆదివాసీ హక్కుల పోరాట సమితి ) బ్యానర్ తో వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానని స్పష్టం చేసారు.
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఉద్యమం చేస్తున్న నాయకులను పక్కన పెట్టి ఎవరితో, ఏవిదంగా చర్చలు జరుపుతారని తనను చర్చలకు పిలిస్తే లంబాడాలను ఎస్టీ జాబితానుండి తొలగించాలనే ఏకైక డిమాండ్ ను సీఎం ముందు ఉంచుతానని అన్నారు. వేరే డిమాండ్స్ ఏవికూడా ఆదివాసీ హక్కుల ను కాపాడలేవని అన్నారు.
~-~~-~~~-~~-~
Please watch: "ఉట్నూర్ లో ఆదివాసీ మహిళల భారీ ర్యాలీ || Adivasi women rally in Utnoor"
• ఉట్నూర్ లో ఆదివాసీ మహిళల భారీ ర్యాలీ || Ad...
~-~~-~~~-~~-~
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: