వల్లకాటి వరకే ఈ భవబంధాలు .. అని ఆలపించిన అన్న ఇకలేడు !|| J. Aseervadam Songs||
Автор: Olive Tv
Загружено: 2024-08-20
Просмотров: 123631
Описание:
మూడునాళ్ళ ముచ్చట కోసం
ఈ మనిషి పడే తపన చూడరా (2)
నీటిబుడగలాంటి జీవితం
ఏ నాడు సమసిపోవునో ఎరుగం (2)
1. మనిషికి తన మనసే చేరసాలరా
మమతలు మమకారాలే బంధాలురా (2)
వల్లకాటి వరకేరా భవబంధాలు
అవి కళ్లానికి చేరవురా అనుబంధాలు (2)
కల్లలైన కళలు మానుకో
ఎల్లవేళలా ప్రభువని వేడుకో (2) ||మూడునాళ్ళ||
2. ఇంద్ర ధనుస్సు లాంటిదోయి సంసారము
అది కనిపించీ మాయమయే రంగులవలయం (2)
గడ్డిపువ్వులాంటిదోయి ఇలలో సౌఖ్యం
అది పాపానికి జీతమురా మనిషికి మరణం (2)
నిత్యమైన సుఖము వెదకరా
నిరతము ఆ ప్రభుని వేడరా (2) ||మూడునాళ్ళ||
3. తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు
అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా (2)
జిగటగల ఊభినుండి పైకి లేపి
నీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువు (2)
తీర్పు తీర్చబడకమునుపే
తప్పక ఆ ప్రభుని కోరరా (2) ||మూడునాళ్ళ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: