సింహాచల గిరిపై వైభవంగా కొనసాగుతున్న నీరాట్టోత్సవాలు (ధారోత్సవం).
Автор: AksharaVision
Загружено: 2026-01-13
Просмотров: 32
Описание:
శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం.
సింహాచల గిరిపై వైభవంగా కొనసాగుతున్న నీరాట్టోత్సవాలు (ధారోత్సవం).
భగవంతుని కల్యాణ గుణ సముద్రంలో ఓలలాడటమే నిజమైన స్నానం. ఆలయ స్థానాచార్యుల ప్రవచనం.
సింహాచలం, జనవరి 13, 2026:
సింహాచల క్షేత్రంలోని శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధానంలో ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఆలయంలో 'నీరాట్టోత్సవాలు' (ధారోత్సవం) కన్నుల పండుగగా నిర్వహించారు. ధనుర్మాస వ్రతాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో ఇది నాలుగవ రోజు.
ఈ సందర్భంగా స్వామివారిని కీర్తిస్తూ ఆండాళ్ అమ్మవారు (గోదాదేవి) రచించిన తిరుప్పావై పాశురాలను పఠించారు. ఈ ఉత్సవ విశిష్టతను ఆలయ స్థానాచార్యులుడాక్టర్ టి పి రాజగోపాల్,వివరిస్తూ.. "నీరాట్టోత్సవం అంటే కేవలం నీటితో చేసే బాహ్య స్నానం మాత్రమే కాదు, భగవంతుని అనంతమైన కల్యాణ గుణాలనే సముద్రంలో మునిగి తేలడం (అవగాహనం)" అని పేర్కొన్నారు. భగవంతుని గుణానుభవమే మనకు నిజమైన శుభ్రతను, ఆనందాన్ని ఇస్తుందని, తద్వారా సంసారికమైన బాధలు, ఖేదం తొలగిపోతాయని తెలిపారు.
ఈ రోజు పఠించిన పాశురంలోని అంతరార్థాన్ని వివరిస్తూ.. "మేము గొల్లకులంలో పుట్టిన అమాయకులమని, మాకు శాస్త్ర పాండిత్యం లేకపోయినా, భగవంతునిపై అచంచలమైన భక్తి ఉందని గోపికలు కృష్ణుని వేడుకున్న తీరును" వివరించారు. ఉదర పోషణ కోసం కాకుండా, భగవంతుని సేవ కోసమే జీవించాలని, ఏడు జన్మలకైనా స్వామివారితో విడదీయరాని బంధం ఉండాలని, ఇతర ప్రాపంచిక కోరికలను తమ మనసుల నుండి తొలగించి, నిత్యం స్వామి సేవలో తరించే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుతూ పాశుర పఠనం జరిగింది. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి, స్వామిని సేవించుకోవడమే పరమ ప్రయోజనమని భక్తులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎన్. సుజాత గారి పర్యవేక్షణలో, ఆలయ ప్రధానార్చకులు, స్థానాచార్యులు, వేద పండితులు, ఇతర ఆలయ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: