సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి అమ్మకాల విధానంపై రైతులకు అవగాహన
Автор: TMEDIA
Загружено: 2025-10-10
Просмотров: 143
Описание: ఖమ్మం జిల్లా సింగరేణి మండలం, కామేపల్లి మండలాలలో సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి అమ్మకాల విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తూ ఇల్లెందు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు పలు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి నరేష్ కుమార్ మాట్లాడుతూ రైతుల పత్తి పొలాలకు వెళ్లి పత్తి కొనుగోలు కేంద్రం విధానాలు, ప్రభుత్వ కనీస మద్దతు ధరలు వివరించారు. 2025–26 సంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన ధరల పై రైతులకు స్పష్టతనిచ్చారు.కరపత్రాలు అందజేసి పంట నమోదు విధానం, పత్తిని సీసీఐ కేంద్రంలో ఎలా విక్రయించుకోవాలో సూచనలు చేశారు. దళారులను నమ్మి పత్తి అమ్మకాలు చేసి రైతు నష్టాల పాలు కాకూడదు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇల్లెందు కార్యదర్శి నరేష్‌కుమార్, పర్యవేక్షకులు శ్రీనివాసరావు, మధు, మునీర్ ,రంజిత్, రవి, బాబూలాల్ తదితర సిబ్బంది పాల్గొన్నారు….
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: