yerukala history ఎరుకల చరిత్ర
Автор: Discovery Man
Загружено: 2022-06-15
Просмотров: 34467
Описание:
ఎరుకల చరిత్ర
------------------- డిస్కవర్ మ్యాన్
రెడ్డి రత్నాకర్ రెడ్డి
( సాయి వెంకట్ , మనోజ్ కుమార్ గార్లకు కృతజ్ఞతలతో.....)
కుర్రో కుర్రు అన్న మాట మనం ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటాం. ఎరుక సానమ్మ సోది చెప్పేముందు అనే మాటే ఈ కుర్రు.
ఈతాకు , దూసర తీగ , నల్ల తీగ , వెదురు బొంగుతో ఎరుకలు చేసిన మాయా జాలమే ఈ గుమ్మి , పొనుక , తడిక , తట్ట , బుట్ట , గంప, గుల్ల, చాట, చీపురు.
పసి పిల్లలకు సైతం గజ్జె చేసి ఇస్తారు . జింక బొమ్మ అల్లి చేతికిచ్చి వారిని మురిపిస్తారు. పల్లె జీవితాన్ని అడవికి అనుసంధానం చేసి, ఎకో ఫ్రెండ్లీ కేరాఫ్ కు అడ్రస్ గా నిలిచింది ఎరుకలే.
గున గున నడిచే బాతుల గుంపు వెనుక నడిచి పొలాలను సారవంతం చేస్తున్నది ఎరుకలే. పల్లెను శుభ్రం చేసే పందుల గాస్తున్నది ఎరుకలే. విష్ణు మూర్తి దశావతారాలలో వరాహావతారం ఒకటి. విజయనగర రాజుల రాజ చిహ్నం పంది.
ఎరుక అనగా "తెలుసు" అని అర్ధం. తెలిసిన వారు కాబట్టి సోది ( భవిష్యవాణి )చెబుతారు.
ఎరుక అనగా జ్ఞానం. ఎరుక చేయడం మూలంగా ఎరుకలు అయ్యారు . అదే కులం పేరుగా మారింది.
ఏకలవ్యుడు ఎరుకల మూల పురుషుడు.
కాగల కార్యాన్ని ఎరుకచేసి అటు పురాణ పురుషులకు , ఇటు ఆయా రాజవంశాలకు చెందిన రాజులకు ఎరుక చెప్పి చరిత్రలో నిలిచిపోయారు.
కురవర్ అనే తమిళ పదం నుండి కుర్రు వచ్చింది. తమిళంలో కుండ్రం అనగా కొండ అని అర్థం. కొండపై నివసించిన వారిని కురవర్ అంటారు. కురవర్ కు మరో అర్థం నాయకుడు.
కురవర్ ల రక్షకుడు సేయోన్ . ఇతనినే మురుగన్ (అందమైనవాడు), సుబ్రహ్మణ్యం , కార్తికేయుడు , కుమారస్వామి అంటారు.
బాల దేవరాయ స్వామిగల్ తమిళంలో రచించిన "కంద షష్ఠి కవచం" లో " కుర మగళ్ (కుమారస్వామిని )నీ
"నేస కుర మగళ్ నినైవోన్ వరుగ " = " నీకు నచ్చిన కుర మగళ్ ని తలుచుకుంటూ రా " అంటారు.
కుమారస్వామిని వేడువర్ అంటారు. వేడువర్ అనగా వేటగాడు. వేడువర్ మరుమగన్ ( వేటగాళ్ల అల్లుడు) అని కూడా అంటారు. కుమారస్వామి ధరించే వేలాయుధం ఆదిమానవుడు ఉపయోగించిన ఈటే ను పోలి ఉంటుంది. కుమార స్వామి కి ఇంకొక అర్ధం గుహ.
ఎరుకల వాళ్లు కొండ ప్రాంతాలలో , గుహలలో జీవించేవారు . వేట ప్రధాన వృత్తిగా ఉండేది.
1878 లో బ్రిటిష్ ప్రభుత్వం అటవీ ఉత్పత్తులను,వేటను నిషేధించడంతో
మైదాన ప్రాంతాలకు విస్తరించారు.
కుమారస్వామి ఎరుక రేడు ( ఎరుకలరాజు )ఐన నంబి రాజర్ కుమార్తె ఐన శ్రీవల్లి ని వివాహమాడిండు.వీరికి కలిగిన సంతానమే నాలుగు ప్రధాన గోత్రాలుగా కనిపిస్తారు.
1) కావడి
2) సాత్పడి
3) మానుపడి
4) మేండ్రగూతి
ఎరుకల జాతి ప్రజలు తమ ఉప వృత్తుల ఆధారముగా విభజించబడినారు.
1)దబ్భ ఎరుకుల ( వీరు బుట్టలను వెదురు పుల్లలతో తయారు చేస్తారు.)
2)ఈత పుల్లల ఎరుకుల (వీరు బుట్టలను ఈత పుల్లలతో తయారు చేస్తారు.)
3)కుంచపురి ఎరుకుల ( వీరు దువ్వెనలు తయారు చేస్తారు .)
4)కరివేపాకు ఎరుకుల ( ఆకు కుారలు అమ్ముట ధ్వార జీవనము సాగిస్తారు )
5)ఉప్పు ఎరుకుల ( ఉప్పు అమ్ముట ధ్వార జీవనము సాగిస్తారు )
ఎరుకలను వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారు.
కర్ణాటక - కొర్చాస్ / కొరమశెట్టి
గుజరాత్ - పొమ్లా
తమిళనాడు - కొరవాస్
మధ్యప్రదేశ్ - బర్గుండ సమాజ్
మహారాష్ట్ర - కైకాడి
రాజస్థాన్ - కీర్ సమాజ్
తెలుగు , తమిళ రాష్ట్రాలలో అధికంగా జీవిస్తున్నారు.
వీరు సంచార జీవులు.నిజాం ప్రభుత్వ కాలం వరకు " రహదారి పత్రాలు " ఉంటేనే వీరు ఒక ఊరి నుండి మరొక ఊరికి వెళ్ళాలి. భారత ప్రభుత్వం ఏర్పడిన తరువాత 1952 లో ఈ ఆంక్షలను తొలగించింది.
ధర్మరాజు అజ్ఞాత వాసంలో ఉన్నప్పుడు ఎరుకల సానిని వివాహమాడాడని , వారికి కలిగిన సంతానమే ఎరుకల జాతికి మూలమని చెబుతారు.
శివుడికి తన కళ్ళనిచ్చి గొప్ప భక్తునిగా పేరుగాంచిన కన్నప్ప తమవారేనని గర్విస్తారు.
చారిత్రిక నేపథ్యం :
క్రీ. శ. 575 లో రేనాటి చోళుడైన ఎరికల్ ముత్తురాజు ధనుంజయుడు కళ్ళమల్ల శాసనం వేయించాడు. క్రీ.శ. 600 లలో పుణ్యకుమారుడు ఎర్రగుడిపాడు శాసనం వేయించాడు. వీరి శాసనాలలో మొదటిసారిగా తెలుగు పదాలు కనిపించాయి. ఎరికల్ అను పదం ఎరుకల పదానికి దగ్గరగా ఉంది. పరిశోధించాలి.
సర్వాయి పాపన్న జీవితంలో ఎరుకల నాంచారమ్మ ప్రస్తావన కనిపిస్తుంది. కాకతీయులు కాలములోనూ నాంచారమ్మ కనిపిస్తుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పిల్లయిపల్లి గ్రామంలో ఎరుకల నాంచారమ్మ జాతర ప్రసిద్ధి పొందింది.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో శిథిలమైన ఎరుకల నాంచారమ్మ గుడి ఉంది.
అక్షరాస్యతకు దూరంగా ఉండి కడు దుర్భరమైన జీవితాన్ని గడపడం విషాదకరం.
( ఇది ప్రాథమిక సమాచారం. లోతైన పరిశోధన జరగాలి )
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: