దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం
Автор: JAVAB TV
Загружено: 2026-01-26
Просмотров: 306
Описание:
అంగరంగ వైభవంగా పడారుపల్లిలో దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం
ఆనందోత్సవాల నడుమ జెండా వందనం, భరతమాత చిత్రపటానికి పుష్పాంజలి, కేక్ కటింగ్, సామూహిక భోజనం
అన్ని సంఘాలు రాజకీయ పార్టీల దివ్యాంగులతో కలిసి నెల్లూరు దివ్యాంగుల JAC ఏకగ్రీవంగా ఏర్పాటు
26/01/2026 తేదీ సోమవారం నాడు నెల్లూరు రూరల్ పడారుపల్లి దివ్యాంగుల కాలనీ శ్రీ అభయ ఆంజనేయస్వామి పార్కు నందు దివ్యాంగుల ఆత్మీయ సదస్సు మరియు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నోవా బ్లడ్ బ్యాంక్ మోపూరు భాస్కర్ నాయుడు పాల్గొనీ దివ్యాంగుల జీవితాలు మెరుగుపడేందుకు తన వంతు కృషి, సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని దివ్యాంగ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల దివ్యాంగ నాయకులు, నెల్లూరు దివ్యాంగుల స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా దివ్యాంగుల ఆత్మీయ సమావేశంలో అందరిని కలవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో దివ్యాంగుల జీవితాలలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, బాధ్యతలతో కూడిన కుటుంబ వ్యవస్థలు ఏర్పడి సంతోషంగా జీవిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం నెల్లూరు జిల్లా అన్ని సంఘాలను కలుపుకొని JAC ఏర్పడడం సంతోషంగా ఉందని ముక్తకంఠంతో అందరూ ఏకీభవించడం జరిగింది. *రాష్ట్ర కన్వీనర్ గా మండవ వెంకట్రావు, జిల్లా కన్వీనర్ గా చీర్ల బాబు యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నుకొని 60 మంది సభ్యులతో కూడిన JAC ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆవుల నాగేంద్ర, V.రమేష్ నాయుడు, గూడూరు వెంకటరమణయ్య, యాదాల వెంకటేశ్వర్లు, దేవిరెడ్డి మల్లికార్జున రెడ్డి ,కూనపు రెడ్డి అరుణ, షేక్ రజియా, పరుచూరి రాజ్యలక్ష్మి తో పాటు సుమారు వందమంది దివ్యాంగ సోదర సోదరీమణులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా వందనం, భరతమాత చిత్రపటానికి పుష్పాంజలి, పరిచయం కార్యక్రమం అనంతరం కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేస్తూ మాట్లాడుకున్నారు. తదనంతరం దివ్యాంగ సోదర సోదరీమణులంతా సహపంతి భోజనం చేశారు.#npdo #nprd #vhps #telagana #telugu #latestnews #disabled #poorpeople #disabilitybenefits #aasara #disabilitypride #latestnews #divyangpension #divyangplay #telagana
#TelanganaNews #Telangana #andrapradesh
మీకు ఈ వీడియోలు నచ్చితే #like , చేయండి, మీ #comments , ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #youtube ఛానల్ #subscribe చేసుకోండి.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: