Tholivalape teeyanidi| Needa leni aadadi| తొలి వలపే తీయనిది|నీడలేని ఆడది - 1974
Автор: Ragam Tanam Pallavi Sarada Akunuri
Загружено: 2022-09-06
Просмотров: 100202
Описание:
"తొలి వలపే తీయనిది మదిలో ఎన్నడు మాయనిది"
డా.సినారె/సత్యం/సుశీల, బాలు
Tholivalape teeyanidi| Needa leni aadadi| తొలి వలపే తీయనిది|నీడలేని ఆడది - 1974
Happy to perform this song • Tolivalape teeyanidi - Sarada Akunuri/Ramu
P గంగాధరరావు నిర్మాతగా, బి.వి. ప్రసాద్ దర్శకత్వంలో నరసింహరాజు, సుధీర్, వరప్రసాద్, ప్రభ, ఉమాదేవి, కల్పన, సీతాలత మొదలగువారు నటించిన నవశక్తి ప్రొడక్షన్స్ వారి నీడలేని ఆడది - 1974 చిత్రం నుండి మధురమైన యుగళం...ఇక్కడ యుగళగీతం తో పాటు బాలు గారి sad version కూడా షేర్ చేస్తున్నాను .
---------------------------------------------------------------------
Happy version Lyrics:
తొలి వలపే.. తొలి వలపే
తియ్యనిదీ.. తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిది
తొలి వలపే తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిది
నీ కొరకే దాచినదీ వేరెవరూ దోచనిదీ
తొలి వలపే తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిది
పొగరూ సొగసూ గల చిన్నది
బిగి కౌగిలిలో ఒదిగున్నది
పొగరూ.. సొగసూ.. గల చిన్నది
బిగి కౌగిలిలో ఒదిగున్నది
ఈ విసురూ ఎక్కడిదీ
నీ జతలోనే నేర్చినదీ
తొలివలపే తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిది
కనులూ కలలూ కలబోయనీ
నీలో సగమై పెనవేయనీ
కనులూ కలలూ కలబోయనీ
నీలో సగమై పెనవేయనీ
కలకాలం ఈ ప్రణయం
నిలవాలీ మనకోసం
తొలివలపే తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిదీ
వలచే హృదయం విలువైనది
కలిసే బంధం విడిపోనిదీ
అనురాగం కొనలేనిదీ
అది ఒకటే మన పెన్నిధీ
తొలివలపే తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిదీ
---------------------------------------------------------------
SAd version Lyrics:
తొలి వలపే తీయనిది
ఆ దాహం తీరనది
కాలంలా కరిగిపోనిది
ప్రాణంలా తిరిగిపోదది
తొలి వలపే తీయనిది
ఆ దాహం తీరనది
వేదంలాగ లిపి లేనిది
వేధిస్తున్న సుఖమైనది
ఓడిస్తున్న గెలుపే అది
ఓదార్చె ఓ పిలుపైనది
చుక్కలనె నిలుపునది
దిక్కులనె కలుపునది
ఆకాశం తానై ఉన్నది
ఒక్కరిలో ఇద్దరది
ఇద్దరిలో ఒక్కటది
నీకోసం నేనై ఉన్నది
తొలి వలపె
ఆ బాధే
గుండెల్లోన గూడె ఇది
గుచ్చే రోజామాలే అది
మాటల్లోన మౌనం అది
మనసుల్లోన ధ్యానం అది
ఏ ఋణమో తెలియనిది
ఏ వరము అడగనిది
ఏ మజిలీ చేరేనో అది
ఎప్పటిదో ఏరుగనిది
ఎన్నటికి మరువనిది
ఓ కధల చేరే కంచికి
తొలి వలపె తీయనిది
ఆ బాధే తీరనది
ఎదకంద లోటుగుంటది
బ్రతుకల్లె తోడు ఉంటది
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: