గ్రామీణ మహిళల జీవనోపాధి కోసం కోళ్లను అందించిన ఎమ్మెల్యే చింతమనేని | VIIDDURA MEDIA
Автор: Viiddura Media
Загружено: 2026-01-05
Просмотров: 746
Описание:
దెందులూరు 06.01.2025
"మహిళల ఆర్థికాభివృద్ధి సాధికారతకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని, గ్రామీణ మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు పెరటి కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించేలా నియోజకవర్గంలో 800 యూనిట్లు మంజూరు చేసి ఆసక్తి కలిగిన మహిళలకు అందించటం జరిగిందని" దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు తెలిపారు....
పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ - సెర్ప్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం జరిగిన "లబ్ధిదారులకు పెరటి కోళ్ల పంపిణీ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు యూనిట్ లను పంపిణీ చేశారు..
ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడుతూ "రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధి మరియు సాధికారతకు అండగా నిలుస్తుందని, స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఉచిత బస్సు ప్రయాణం అందించడంతోపాటు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే వారందరికీ కూడా డబ్బును నేరుగా వారి తల్లి అకౌంట్ కు జమ చేయడం జరిగిందని తెలిపారు.. అదేవిధంగా గ్రామీణ మహిళలకు జీవనోపాధిని కల్పించే కార్యక్రమంలో భాగంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో మండలానికి 200 యూనిట్లు చొప్పున ఎనిమిది వందల పెరటి కోళ్ల పెంపకం యూనిట్లను మంజూరు చేసి వాటిని లబ్ధిదారులకు అందించడం జరిగిందని తెలిపారు..రూ.5వేల రూపాయల విలువగల ఈ ఒక్కొక్క యూనిట్లో నాలుగు కోడిపుంజులు మరియు ఆరు కోడి పెట్టలు తోపాటు 25 కేజీల దానా బస్తాలు మెడికల్ కిట్ ను కూడా వారికి అందించడం జరుగుతుందని సుమారు 16 వారాలు వయసు కలిగిన కోళ్లను ఇవ్వడం ద్వారా పెంపకం దారులకు జీవనోపాధికి ఎంతగానో ఉపకరిస్తుందని, అదేవిధంగా కోళ్లు అన్నిటిని కూడా వ్యాక్సినేషన్ చేయించి డివోమింగ్ ప్రక్రియ చేయించి వాటిని ఆరోగ్యవంతంగా అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని మెరుగైన ఉపాధి అవకాశాలు పొందాలని దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు సూచించారు...
ఈ కార్యక్రమంలో జిల్లా డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ విజయరాజు, దెందులూరు ఏఎంసీ చైర్మన్ గారపాటి రామసీత, విజయవాడ కనకదుర్గ టెంపుల్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ మోరు శ్రావణి, జిల్లా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పలపాటి రాంప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు విజయరాయ్ సొసైటీ చైర్మన్ బొప్పన సుధా, మండల పార్టీల అధ్యక్షులు ఇడుపుగంటి అనిల్, మరడాని రవి, నంబూరు నాగరాజు, తెలుగు యువత అధ్యక్షులు మోత్కూరు నాని, జనసేన నాయకులు గరికిపాటి చంటి సహా పలువురు సొసైటీల చైర్మన్లు, క్లస్టర్ ఇంచార్జిలు, కూటమి నాయకులు, లబ్ధిదారులు, అధికారులు పాల్గొన్నారు..
-------
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: