Chaganti Koteshwar Rao gaaru about Dr AV Gurava Reddy and KIMS Sunshine Begumpet Hospital
Автор: Dr Guravareddy Annapareddy
Загружено: 2025-06-21
Просмотров: 139342
Описание:
పారే గుణం ప్రతీ నదికి వున్నా,
పాపాలు కడిగే వరం గంగకే వుంది!
బహుశా జటాజూటం నుంచి జారే అదృష్టం కాబోలు!
ఉద్భవ స్థానం యొక్క ఔన్నత్యం అటువంటిది..
అలాగే, రామాయణ మహాభారతలకి చెప్పే గొంతుకలెన్నున్నా,
ఓ స్వచ్ఛమైన గుండె నుంచి,
ఓ పవిత్రమైన భక్తి నుంచి ఉద్భవించిన చాగంటిగారి ప్రవచనంలోనే
ఆ ఇతిహాసాల ఆధ్యాత్మిక ఐశ్వర్యం ఇమిడి వుంది!
సరస్వతి దేవి చిటికెనువేలు పట్టుకొని,
సాక్షాత్తూ శివుడి వడిలో అక్షరాభ్యాసం జరిగి,
మా కథలని కంచి వరకు చేర్చమని సాగనంపినట్టు,
విద్వత్తుని విభుదిలా ధరించి, తెలుగు నాటని తరింపచేశారు చాగంటి గారు!
అయన వర్ణనలో
రాముడు మనింట వెలుగుతాడు,
కృష్ణుడు వెతికి మరి గడప చేరుతాడు,
శివుడేమో భుజం తట్టి ఆత్మవిశ్వాసాన్ని,
అమ్మవారేమో లాలించి ధైర్యాన్ని,
టీవీ, రేడియోల మాధ్యమాన ఇంట తిరుగుతుంటారు!
ఆ వాగ్ధాటితో,
ఆ జారే మాటల జటాజూటపు అమృతఝరిలో,
తడిసి, మైమరిచి పుణ్యాలని పొందిన శ్రోతలెందరో!
దేవుళ్ళని ఇళ్ళకి ఆహ్వానించి లాలించిన భక్తులెందరో!
గంగ లాంటి ఆ పవిత్ర పటిమకి,
వైద్యుడిగా రెండు మోకాళ్లని మార్చడం,
తిరిగి వారిని నడిపించడం ఎంతో తృప్తిని కలిగించింది!
అంతే కాక,
మా హాస్పిటల్ ని మరీ మరీ గుర్తుంచుకొని
KIMS Sunshine బేగంపేట్ హాస్పిటల్ గురించి,
అందులోని ప్రతీ గోడ, పలకరించిన ప్రతీ మనిషి గురించి
ఆయన అభిప్రాయాలని పంచుకోడం,
మా హాస్పిటల్ కే కొత్త ఉతేజాన్ని ఇచ్చింది!
అలాంటి ప్రేమను నా పై, మా హాస్పిటల్ పై కురిపించినందుకు,
చాగంటి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు!
తాజ్ మహల్ కి బీటలు పారితే, శ్రద్ధగా సవరించుకున్నట్టు
చాగంటిగారి లాంటి నేషనల్ treasure ని,
తిరిగి కాళ్ళ మీద నిలబడి నడిచెట్టు చేయడం,
ఓ రకంగా నా బాధ్యత.. మరింత లోతుగా, అది నా అదృష్టం! - గురవా రెడ్డి!
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: