కుల వ్యవస్థ - చారిత్రక భౌతికవాదం
Автор: Democracy Dialogues - Speeches of Balagopal
Загружено: 2020-11-01
Просмотров: 17085
Описание:
కులం, కులవ్యవస్థ, వర్ణధర్మం – ఇవి మూడూ ఒకటేనా? వీటి మధ్యనున్న తేడాలు ఏమిటి? సంబంధాలు ఏమిటి? ప్రపంచంలోని చాలా దేశాలలో అసమాన సామాజిక సంబంధాలు ఉన్నప్పటికీ ఒక్క భారతదేశంలోనే ఇవి ఎందుకు ఇంతగా వ్యవస్థీకృతం అయ్యాయి?
చారిత్రక భౌతికవాదం కులాన్ని, కులవ్యవస్థను అర్థం చేసుకోవడానికి సరిపోతుందా? చారిత్రక భౌతికవాదాన్ని ఆమోదిస్తే కులం ఉపరితల అంశమే గానీ పునాదిలో భాగం కాదనే వాదన సరియైనదేనా? అసలు చారిత్రక భౌతికవాదం భారతదేశానికి వర్తిస్తుందా? చారిత్రక భౌతికవాదంలోని వర్గమే భారతదేశంలో కులం అనే వాదనలో పస ఎంత?
ఉత్పత్తి సంబంధాలు అంటే ఏమిటి? ఉత్పత్తి సంబంధాలలో కులం పాత్ర ఏమిటి? ఉత్పత్తి శక్తులలో, సంబంధాలలో వచ్చిన మార్పులను అర్థం చేసుకుంటే తప్ప కులవ్యవస్థ మనకు అర్థం కాదా?
కులం, కులవ్యవస్థ, వర్ణధర్మాల చారిత్రక క్రమం ఏమిటి? చరిత్రలో కులవ్యవస్థలో వచ్చిన మార్పులు ఏమిటి? ఇప్పుడున్నట్లే చరిత్రలో కులం ఉండేదా? ప్రాచీన కాలంలో, మధ్య యుగాలలో, ఆధునిక కాలంలో కులవ్యవస్థ పాత్రను అధ్యయనం చేయడానికి అవసరమైన సాధనాలు ఏమిటి?
ఇటువంటి అత్యంత ప్రాముఖ్యం కలిగిన విషయాలను విశ్లేషిస్తూ బాలగోపాల్ చేసిన వివరమైన ఉపన్యాసం ఇది. ఈ ఉపన్యాసం లో చివరి భాగం దొరకలేదు. మధ్యలో అక్కడక్కడ కొంత భాగం రికార్డు కాలేదు. ఇది ముందే దొరికి ఉంటే, దీని ప్రసంగ పాఠం ‘ప ర్ స్పె క్టి వ్స్’ ప్రచురించిన ‘దళిత’ పుస్తకంలో వచ్చి ఉండేది.
ఇది ఏ సమావేశంలో, ఏ రోజున మాట్లాడేరో ఆ వివరాలు తెలియవు. సుమారుగా 1995-96 లో కావచ్చు.
#కులం , #కులవ్యవస్థ , #వర్ణధర్మం , #చారిత్రకభౌతికవాదం #పునాది , #ఉత్పత్తిసంబందాలు
సమస్త బాలగోపాల్ రచనలు, ఉపన్యాసాల కోసం ఈ కింది లింక్ ను క్లిక్ చెయ్యండి.
https://balagopal.org/
#SpeechesOfBalagopal
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: