ఏపీలో 50,000 వేల మందికి ‘క్వాంటమ్’ శిక్షణ - డిసెంబరు 8 నుంచి ప్రారంభం
Автор: Dr. Chinnarao
Загружено: 2025-11-29
Просмотров: 41484
Описание:
శిక్షణా ఫీజు వివరాలు: ఏపీలోని విద్యార్థులకు రూ.500, ఇతర రాష్ట్రాలకు చెందినవారికి రూ.1,000, ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారికి, అధ్యాపక వృత్తిలో ఉన్నవారికి రూ.2,000 చొప్పున కోర్సు ఫీజుగా నిర్ణయించారు. కోర్సులో చేరాలనుకున్నవారు https://learn.qubitech.io వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కోర్సు మొత్తం ఆన్‌లైన్‌లోనే ఉంటుంది.
3 భాగాలుగా ఫేజ్-1: ఫేజ్-1 కోర్సు మూడు భాగాలుగా ఉంటుంది. ఎంఐటీ, ప్రిన్స్‌టన్, స్టాన్‌ఫోర్డ్ వంటి ప్రఖ్యాత విద్యా సంస్థలకు చెందిన ప్రొఫెసర్లతో పాటు క్వాంటమ్ టెక్నాలజీలో విశేష కృషి చేసిన నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ విలియం ఫిలిప్స్ లెక్చర్లు మొదటి భాగంలో ఉంటాయి.రెండో భాగంలో అమెరికాలో గూగుల్, ఐయాన్‌క్యూ, ప్రిన్స్‌టన్, డ్యూక్ వంటి సంస్థలకు చెందిన క్వాంటమ్ ల్యాబ్‌లను చూపిస్తారు.
ఇక చివరగా మూడో భాగంలో పరిశ్రమ, స్టార్టప్‌లకు చెందిన ప్రతినిధులతో ప్యానల్ డిస్కషన్లు, గెస్ట్ లెక్చర్లు ఉంటాయి. రీసెర్చ్ ఇంజినీర్లు తమ అనుభవాలను వివరిస్తారు. ఐఐఎస్‌సీ బెంగళూరులో తొలి ప్రొటానిక్ క్వాంటమ్ కంప్యూటర్‌ను అభివృద్ధి చేసిన ప్రొఫెసర్ చంద్రశేఖర్‌తో రెండు గెస్ట్ లెక్చర్లు ఉంటాయి.
ఆన్‌లైన్‌లోనే శిక్షణ: కోర్సు మొత్తం ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. వారానికి ఒక మాడ్యూల్ చొప్పున కోర్సు అప్‌లోడ్ చేస్తారు. ఆన్ డిమాండ్ లెక్చర్లు కావడంతో విద్యార్థులు వారికి వీలైన సమయంలో లాగిన్ కావచ్చు. వారానికి 8 గంటలు చొప్పున కోర్సు నిడివి సుమారు 32 గంటలు ఉంటుంది. ప్రతివారం పరీక్షలు, ఎసైన్‌మెంట్లు ఉంటాయి. కోర్సు చివరిలో తుది పరీక్ష నిర్వహిస్తారు.
🔥
#QuantumComputing #APGovernment #SkillDevelopment #AndhraPradesh #FutureTechnology #AI #QuantumTraining #Superposition #Qubits #TechCareers #EnrollNow #YouthEmpowerment #DigitalAP #Innovation #QuantumIndia #APSkills
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: