Ch01 Autobiography of a Yogi (Telugu) | పరమహంస యోగానంద | ఒక యోగి ఆత్మకథ
Автор: Yogoda Satsanga Society of India
Загружено: 2022-02-10
Просмотров: 126014
Описание:
యోగ శాస్త్రపు అంతరాళాల్లోకి చొచ్చుకుపోయే, పరమహంస యోగానందగారి విశిష్టమైన జీవిత చరిత్రను తెలిపే ఈ ఆడియో బుక్ మిమ్మల్ని మరపురాని రీతిలో యోగులు మరియు ఋషులు, విజ్ఞానశాస్త్రం మరియు అద్భుతాలు, మరణం మరియు పునరుజ్జీవనం వీటన్నిటి ప్రపంచాన్ని శోధించడానికి లాక్కెళుతుంది.
ప్రపంచవ్యాప్తంగా ఒక అధ్యాత్మిక నిధిగా మెప్పు పొంది, అత్యధికంగా అమ్ముడుపోతున్న ఈ ఆధ్యాత్మిక ప్రామాణిక గ్రంథరాజం లక్షలాది మందికి—అత్యంత పరిపూర్ణత్వాన్నిచ్చే, పరిణామశీలమైన, తమదైన—నవ్య జీవన యానాన్ని ప్రారంభించేటట్టు ప్రేరణ కలిగించింది. జ్ఞాన ప్రదాయకమూ, హాస్యరస స్ఫోరకమూ, స్ఫూర్తిదాయకమూ అయిన పరమహంస యోగానందగారి అపూర్వ జీవితగాథ ఈ రీతిలో నోటి మాటల్లో తేటగా విశదీకరించబడింది.
కొత్తవారూ, ఎంతో కాలంగా ఈ పుస్తకంతో చెలిమి చేసి ఉన్నవారూ కూడా పరమహంస యోగానందగారి వర్ణరంజితమైన అనేక కథల్లోని సొంపు చెడకుండా, ఆయన యొక్క ఆధ్యాత్మిక అనుభవాల సంపన్నతలోని నగిషీల మెరుపును, ఆయన ఇతర ఋషులను సందర్శించడాన్ని, మనలో జ్ఞానోద్దీపన కలిగించే ఆయన జీవితంలోని అత్యద్భుత ఘటనలను మనకు సజీవంగా ఆవిష్కరించే విధంగా సున్నితంగా, వినసొంపైన రీతిలో చదివిన నిపుణుడైన కథకుడిని మెచ్చుకోక మానరు.
ఈ ఆడియోబుక్ సంచిక అసంక్షిప్త రూపంలో ఉచిత డౌన్ లోడ్ కొరకు mp3 రూపంలో క్రింది లింక్ లో అందుబాటులో ఉంటుంది:
https://bookstore.yssofindia.org/prod...
1946 లో ఈ పుస్తకం ప్రచురణ అయినప్పటి నుండీ ప్రపంచంలోని ప్రసార మాధ్యమాలు నిలకడగా దీనిపై ప్రశంసల జల్లు కురిపిస్తూనే ఉన్నాయి, 1999 లో “ఈ శతాబ్దపు 100 అత్యుత్తమ ఆధ్యాత్మిక గ్రంథాలలోఒకటి“ గా దీనిని గుర్తించారు.
https://yssofindia.org/paramahansa-yo...
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వారి ఇతర వీడియోల కోసం సబ్ స్క్రైబ్ చేయవలసిన లింక్:
/ yoganandayss
యోగదా సత్సంగ సొసైటీ గురించి ఇంకా తెలుసుకోవడానికి లింక్: https://yssofindia.org
Playlist: • Autobiography of a Yogi - Telugu Audio Book
#Spirituality#Yogananda#Audiobook
#HowToLive
#YSS
#SRF
#YogodaSatsangaSociety
#KriyaYoga
#AutobiographyofaYogi
#ParamahansaYogananda
#MahavatarBabaji
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: