పీడిత వర్గాల విద్యార్థులలో వస్తున్న చైతన్యాన్ని తట్టుకోలేకనే! ప్రొ జి విజయ్
Автор: SJF News
Загружено: 2026-01-19
Просмотров: 15
Описание:
17/01/2026,రోహిత్ వేముల అమరత్వానికి 10 ఏళ్లు నిండిన సంధర్భంగా తేది:17-01-2026న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన ఒకరోజు సెమినార్ కు ఆల్ ఇండియా కన్వీనర్ బండారి లక్ష్మయ్య అధ్యక్షత వహించారు. విశ్వవిద్యాలయాల్లో కుల అణిచివేత, విద్యార్థి ఉద్యమాలు-రోహిత్ చట్టం ఆవశ్యకత అనే అంశాలపై ప్రొఫెసర్ కే శ్రీనివాసులు, వి రఘునాథ్ హైకోర్టు అడ్వకేటు, ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ కే వై రత్నం, ప్రొఫెసర్ జి విజయ్ తదితరులు మాట్లాడారు.
ప్రొ కే శ్రీనివాసులు (ఉస్మానియా విశ్వవిద్యాలయం) మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు సమాజంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యలపై చర్చించి పరిష్కరించే పద్దతులను,పరిష్కార మార్గాలను సూచించే బాధ్యతను కల్గి ఉన్నాయి.అంతేకాదు ప్రజాస్వామిక, సామాజిక విలువలను, నైతిక విలువలను పెంపొందించడానికి కృషి చేయడంలో భాగంగా అవి నెలకొల్పబడ్డాయి. కానీ ఈనాటి పాలకులు విశ్వవిద్యాలయాలను విద్యార్థులకోసం కాకుండా ప్రైవేటు కార్పోరేట్ పెట్టుబడిదారుల ప్రయోజనాలను నెరవేర్చడానికి వాటిని ఉపయోగిస్తున్నారన్నారు.బడుగుబలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను పొందే అవకాశాలను ధ్వంసం చేస్తున్నారన్నారు.
వి.రఘునాథ్,హైకోర్టు అడ్వకేటు మాట్లాడుతూ రోహిత్ వేములతోపాటు 5 మంది దళిత విద్యార్థులను యూనివర్సిటీ నుండి సామాజిక బహిష్కరణకు గురిచేయడం ఒక నేరపూరిత చర్య అవుతుందన్నారు.దళిత విద్యార్థులపై కుల వివక్షను ప్రదర్శించిడం,చదువుకోకుండా అనేక సమస్యలను సృష్టించడమేకాదు, బాధిత విద్యార్థులను నిందితులుగా చిత్రించే కుట్రలకు పాల్పడుతున్నారన్నారు.మరొకవైపు నిందితులను బాధితులుగా పరిమార్చే ఎత్తుగడలను అవలంభిస్తున్నారన్నారు.అంతేకాదు దళిత బాధిత విద్యార్థులను అసాంఘిక శక్తులుగా ముద్రవేసి శిక్షించడానికి ఏర్పాట్లు చేస్తున్నారన్నారు.
ప్రొ.కె లక్ష్మీనారాయణ(హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ) మాట్లాడుతూ తరతరాలుగా దళిత బహుజనులకు విద్యను నిరాకరించారని స్వాతంత్య్ర పోరాటాల ఫలితంగా వచ్చిన మార్పులతో 8వ దశకం తర్వాత పూలే,అంబేద్కర్,మహనీయులను చదువుకోవడం వల్ల బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలను అందుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి కుల అణచివేత, హింసలకు పాల్పడుతున్నారన్నారు.ఉన్నత విద్యాసంస్థలు అగ్రకుల బ్రాహ్మణీయ మనువాదులకు కేంద్రాలుగా మారాయని వాటిని సమతా కేంద్రాలుగా మార్చవలిసిన అవసరం ఉందన్నారు.
ప్రొ.కె వై రత్నం(హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ) మాట్లాడుతూ ఈ దేశంలో పూలే అంబేడ్కర్లను పరిచయం చేసింది మనవారు కాదని గెల్ ఓమ్ వేత్ లాంటి అమెరికా మహిళా ప్రొఫెసర్లన్నారు.ఊరులోనే కాదు వెలివాడలు, విశ్వవిద్యాలయాలలో సైతం ఉన్నాయని రోహిత్ వేముల ప్రపంచానికి చాటి చెప్పాడన్నారు.ఆయన మరణించే ముందు రాసిన రెండు లేఖలు పీడితులను ఎల్లప్పుడు మేల్కొల్పుతూనే ఉంటాయని,రోహిత్ వేముల చేసిన త్యాగం వృథాకాదని వాడ వాడలో వెలుగులు విరజిమ్ముతూనే ఉంటుందన్నారు.అగ్రకుల బ్రాహ్మణీయ మనువాద శక్తులకు రోహిత్ వేముల పేరెత్తితేనే ఊపిరి ఆడడం లేదని అందుకే వారందరూ పూనుకుని రోహిత్ దళితుడు కాదనే దుష్టత్వానికి ఒడిగడుతున్నారన్నారు.
ప్రొ.జి.విజయ్(హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ) మాట్లాడుతూ నేటి పాలకులు విశ్వవిద్యాలయాల్లో పరిశోధన, శాస్త్రీయ విద్యలు కొనసాగకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని,విద్యార్థులలో ప్రశ్నించి పోరాడే తత్వాలను దెబ్బతీయడానికి కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారన్నారు.దళిత గిరిజన వెనుకబడిన విద్యార్థులలో వస్తున్న చైతన్యాన్ని తట్టుకోలేకనే ఈ అసహనాన్ని ప్రదర్శిస్తూ అణిచివేత చర్యలకు పూనుకుంటున్నారని తెలిపారు.
బండారి లక్ష్మయ్య(కె ఏ ఎన్ పి ఎస్) మాట్లాడుతూ విద్యాసంస్థల్లో కొనసాగుతున్న కుల వివక్ష, అణిచివేతలకు వ్యతిరేకంగా రోహిత్ చట్టం రావలసిన అవసరం ఉందని దానికోసం పౌర సమాజం, పౌర ప్రజా సంఘాలు,మేధావులు సంఘటితంగా పోరాడవలసిన అవసరం ఉందని దానిలో భాగంగా మా సంస్థ తనవంతు బాధ్యతను తీసుకుంటుందని తెలియజేశారు. ఈ సమావేశంలో దళిత ప్రజాసంఘాల నేతలు, ప్రొఫెసర్లు, మేధావులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి
గన్నారపు సరోజన, రాష్ట్ర అధ్యక్షులు,
ఎర్ర మోహనకృష్ణ, రాష్ట్ర కోశాధికారి,
జె.చక్రవర్తి, రాష్ట్ర కమిటీ నాయకులు.
#rohithvemula #rohithact #UOH #CasteDiscrimination #dalithnews #casteinequalities #untouchability
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: