68 రోజుల్లోనే పంట చేతికొచ్చే కొత్త వంగడం! || Sagevideos || Sage media
Автор: Sage Media
Загружено: 2025-07-01
Просмотров: 121
Описание:
#Ikrisat #rapidcopper #sagevideo #centralnews
68 రోజుల్లోనే పంట చేతికొచ్చే కొత్త వంగడం!
మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా ఎదురవుతున్న అనేక సమస్యలకు సంపూర్ణ పోషక విలువలు ఉండే చిరుధాన్యాలు (మిల్లెట్స్) పరిష్కార మార్గంగా మారాయి. క్రమేణా మిల్లెట్ల వినియోగం పెరుగుతుండటంతో రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, ఊదలు, సామలు, అరికెలను మరింతగా వినియోగంలోకి తెచ్చేందుకు విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక్రిశాట్ (అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ) రాగులపై పరిశోధనలు చేసి, 'ర్యాపిడ్ రాగి’ అనే పేరుతో ఓ సరికొత్త వంగడాన్ని అభివృద్ధి చేసింది.
శనగలు, కందుల తర్వాత స్పీడ్ బ్రీడింగ్ విధానంలో సైంటిస్ట్‌లు నాలుగేళ్ల వ్యవధిలోనే దీన్ని తయారు చేశారు. సాంప్రదాయిక రకాల కంటే ఎన్నో రెట్లు మేలైనదిగా గుర్తింపు పొందిన ఈ రకాన్ని తాజాగా ఇక్రిశాట్ విడుదల చేసింది.
ప్రయోజనాలెన్నో :దేశంలో జొన్న, సజ్జల తర్వాత మూడో అత్యంత ముఖ్యమైన చిరుధాన్యంగా రాగి పంట గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్ష ఎకరాల్లో, తెలంగాణలో 13 వేల ఎకరాల్లో సాగవుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి వంగడాలతో పంట కాలం 135 రోజులుగా ఉండటంతో ఏడాదికి 2 పంటలు మాత్రమే సాధ్యమవుతున్నాయి.
ఇక్రిశాట్ కొత్త వంగడం 'ర్యాపిడ్ రాగి' పంట 68 రోజుల్లోనే చేతికొస్తుంది.
దీంతో ఏడాదిలో 5 పంటలను పండించవచ్చు.
విత్తనం వేసిన తర్వాత సత్వరమే అది మొలకెత్తుతుంది.
తక్కువ పూతతో మొక్క మరింత వేగంగా ఎదుగుతుంది.
ఎక్కువ కాంతి, ఉష్ణోగ్రత, తేమ నుంచి తట్టుకోవడంతో పాటు తక్కువ నీటితో సాగవుతుంది.
ప్రస్తుతం పండిస్తున్నటువంటి రాగి పంటకు సగటున 26-29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. కానీ అంతకంటే తక్కువ టెంపరేచర్ ఉన్నప్పటికీ ర్యాపిడ్ రకం పంట అధిక దిగుబడినిస్తుంది. ప్రస్తుతం ఎకరమునకు 7.5 నుంచి పది టన్నుల వరకు దిగుబడినిస్తోంది. అంటే ఎకరానికి పదిహేను టన్నుల నుంచి ఇరవై టన్నుల దిగుబడి మాత్రమే నన్నమాట. ర్యాపిడ్ రాగి సాగుతో ఏడాదికి 75 నుంచి 100 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు.
ర్యాపిడ్ రాగి అత్యుత్తమ వంగడమని ఇక్రిశాట్ సీనియర్ సైంటిస్ట్ శోభన్ సజ్జా తెలిపారు. ఇది రైతులకు లాభాలను అందించడంతో పాటు సాగును రెండున్నర రెట్ల మేరకు పెంచి మిల్లెట్స్(చిరుధాన్యాలు) మరింత అందుబాటులోకి తెస్తుంది. మున్ముందు ఇతర చిరుధాన్యాలపైనా పరిశోధనలకు చేపట్టి, మెరుగైనటువంటి రకాలను రూపొందించే యత్నాల్లో ఉన్నామని ఆయన వివరించారు.
#centralgoverment #ikricet #agriculture #apgovernment #telangananews #rapidragi #youtubevideos #agreculturevedeo
https://www.instagram.com/sage31jly?i...
https://www.facebook.com/share/fUzSs2...
https://x.com/ThullimelliK?t=MLgRjPfD...
Повторяем попытку...

Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: