1939 వ సం. నాటి క్లాసిక్ సినిమా "రైతుబిడ్డ" గురించి విశ్లేషణ:
Автор: SANAGANA
Загружено: 2025-12-24
Просмотров: 175
Описание:
1939 వ సం. నాటి క్లాసిక్ సినిమా "రైతుబిడ్డ" గురించి విశ్లేషణ:
రైతుబిడ్డ' సందేశాత్మక తెలుగు చలన చిత్రం . తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమాకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. నిషేధింప బడిన మొదటి తెలుగు సినిమా ఇది. రైతు బిడ్డ (1939)
తెలుగు సినిమా చరిత్రలో టాప్ టెన్ సాంఘిక చిత్రాలలో ఒకటి. కేవలం వినోదం మాత్రమే కాదు…సమాజానికి అద్దం పట్టిన రోజులలో వచ్చిన గొప్ప చిత్రం. రైతు కష్టాన్ని ధైర్యంగా చూపిం చినచిత్రాలలో ఒకటి.
కథా నేపథ్యం:
భూమిని నమ్ముకుని బతికే రైతు జీవితం ఆధారంగా తీసిన కథ. పంట పండించేది రైతే…కానీ లాభం మాత్రం దళారులు, జమీందారులది.ఈ అన్యాయ వ్యవస్థ
లోఒక రైతు కుటుంబం ఎలా నలిగి పోతుందోఅదే ఈ సినిమా హృదయం.
రైతు పాత్ర - సమాజానికి ప్రశ్న ఈ సినిమాలో రైతు బలహీనుడు కాదు.
అజ్ఞానుడూ కాదు. అతను శ్రమజీవి.
కానీ వ్యవస్థ అతని శ్రమను దోచు కుంటుంది.1930ల లోనే ఈ విధమైన కథ చెప్పడం అప్పుడు ఒక సాహసం.
అందుకే రైతు బిడ్డ సినిమా కాదు.ఒక ఉద్యమం.ధైర్యమైన సాంఘిక సందేశం ఇచ్చింది ఈ చిత్రం. ఆ కాలంలో జమీం దారుల్ని ప్రశ్నించడం సాధారణ విషయం కాదు. కానీ రైతు బిడ్డ భయపడ లేదు. రైతు కష్టాన్ని చూపింది. దోపిడీని బయటపెట్టింది. ప్రశ్నలు వేసింది. ఇదే నిజమైన సాంఘిక సినిమా లక్షణం.
నటీనటుల నటన అతి లేకుండా సహ జంగా ఉంటుంది. కానీ వారి మాటలు, చూపులు మనసుకు గట్టిగా తాకు తాయి. అందుకేఈ సినిమా చూసిన తర్వాత రైతు మీద మన దృష్టి మారు తుంది. రైతు బిడ్డ సినిమా అంతా నిజం మాట్లాడింది కాబట్టే అప్పటి బ్రిటిష్ పాలనలో వివాదాలకు గురైంది. కొన్ని ప్రాంతాల్లో సినిమాను నిషేధించారు కూడా. ఇది ఒక్కటే చాలు ఈ సినిమా ఎంత శక్తివంతమో చెప్పడానికి. ఎందు కంటే రైతును హీరోగా చూపింది. అన్యాయాన్ని నేరుగా ప్రశ్నించింది. కాలానికి ముందే వచ్చింది. అందుకే రైతు బిడ్డ సినిమాకి ఇప్పటికీ ఎందుకు అంత ప్రాముఖ్యం? ఈ రోజుకి కూడా రైతు సమస్యలు మారలేదు. అందుకే రైతు బిడ్డ ఒక పాత సినిమా కాదు. అది ఇప్పటికీ వర్తించే సత్యం. మీరు రైతు బిడ్డ చూడకపోతే తెలుగు సినిమా ధైర్యాన్ని మీరు చూడనట్టే. ఇలాంటి మరిన్ని సాంఘిక & క్లాసిక్ సినిమా కథల కోసం నా చానల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: