మారెమ్మ ఆలయ పూర్ణ కుంభాభిషేకం లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
Автор: FIRST NEWS 4U
Загружено: 2026-01-23
Просмотров: 89
Описание:
చిత్తూరు జిల్లా.......
బంగారుపాలెం మండలం........
కొదలమడుగు గ్రామంలో మారెమ్మ ఆలయ పూర్ణ కుంభాభిషేకానికి విచ్చేసిన పూతలపట్టు మాజీ శాసనసభ్యులు ఎంఎస్ బాబు...
కర్ణాటక బెంగళూరు నుండి విచ్చేసిన పూతలపట్టు మాజీ శాసనసభ్యులు ఎంఎస్ బాబు కాన్వాయిలో భాగంగా భాగంగా తన అభిమానుల మధ్య కొదమడుగు గ్రామానికి శుక్రవారం ఉదయం 11 గంటలకు విచ్చేసిన ఆయనకు గ్రామస్తులు బొకే అందించి పూలమాలలు వేసి మేళ తలాలతో, మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం నూతన నిర్మాణ ఆలయంలో పాల్గొన్న ఎమ్మెస్ బాబుకు ఆలయ అర్చకులు స్వాగతం పలికి వారి పేరుపై కుంకుమార్చన, అర్చన చేసి వారి కుటుంబం అష్టైశ్వర్యాలతో ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆలయ అర్చకులు దీవించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కొన్ని సంవత్సరాలుగా ఆలయం కావాలని కొంతమందిని కోరిన, వెనకబడడంతో మాజీ శాసనసభ్యులు ఎమ్మెస్ బాబు గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఆలయ అభివృద్ధికి సహకరించారు. అమ్మవారి కృప మీ అందరికీ కూడా కలగాలని గ్రామస్తులు అడిగిన వెంటనే ఆలయ విషయంలో వాళ్లకి భరోసా కల్పిస్తూ.........
తాను గతంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కోరిన గ్రామస్తుల కోరిక మేరకు మా గ్రామంలో అమ్మవారి ఆలయం ఉంటే మేము మ్రోక్కుబడులు చేసుకోవడానికి కానీ, ఓం శక్తి మాలలు, అయ్యప్ప మాలలు వేసుకోవడానికి ఎంతో మేలు మాకు కలుగుతుందని గ్రామస్తులు విన్నవించుకోవడంతో అటువంటి కార్యక్రమం ఈ దినం జరగడం పట్ల తనకెంతో ఆనందంగా ఉందని తెలిపారు.
అమ్మవారిని మరిచిపోకుండా భక్తిశ్రద్ధలతో కొలిస్తే మీ గ్రామానికి మంచి జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు.
తమ గ్రామంలో అమ్మవారి పూజా కార్యక్రమానికి పిలవడం పట్ల గ్రామస్తులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, నియోజకవర్గ, మండల పరిధిలో కానీ, తన అనుచరులు ఇప్పటికీ స్వాగతిస్తున్నారని ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
కార్యక్రమానికి విచ్చేసిన బంగారుపాళ్యం మండల మాజీ మార్కెట్ చైర్మన్ నారే సోమశేఖర్, జిల్లా బీసీ సెల్ నాయకులు పిబి లక్ష్మి ప్రసన్న కుమార్, గోవర్ధనగిరి మంజు, మండలంలో కల తన అభిమానులు, కొదలమడుగు గ్రామస్తులు,మహిళలు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: